– సమాజం పట్ల మీ బాధ్యతను మరవద్దు
– మీలాంటి వైద్యులతో కలిసి పనిచేయడానికి సిద్ధం
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10: నేను డాక్టర్ ను కాదు.. కానీ సోషల్ డాక్టర్ నని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చమత్కరించారు.హెచ్ఐసీసీలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ, భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా ఇక్కడకు వచ్చిన యువ కార్డియాలజిస్టులు అందరికీ స్వాగతం పలుకుతున్నానన్నారు. మీరంతా సక్సెస్ ఫుల్ కార్డియాలజిస్టులు. అయినా మీ నాలెడ్జ్ ని ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకోవడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఈ కాన్ఫరెన్స్ కు వచ్చారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం. కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే మీ కెరీర్ కు ముగింపు పలికినట్లే ఈ కాన్ఫరెన్స్ హైదరాబాద్ లో జరగడం ఎంతో గర్వకారణం లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాలలో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది చాలా మంది డాక్టర్లు అవ్వాలనుకున్నా అందుకు అర్హత సాధించలేరు. మీరంతా సమాజంలో ఒక ప్రత్యేక గ్రూప్. డాక్టర్లు ప్రాణాలు కాపాడుతారని మేం బలంగా నమ్ముతామన్నారు. మనుషులపట్ల, సమాజం పట్ల మీ బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ప్రజల ప్రయోజనాల కోసం మా పాలసీని మెరుగుపరచడానికి మీలాంటి వైద్యులతో కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఆ దిశగా మీ సలహాలు, సూచనలు ఇచ్చి మాకు సహకరించండి. విజ్ఞానం, సాంకేతికత ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తున్నాయి. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతికతలతో ఆరోగ్య సంరక్షణ హై టెక్నాలజీతో ముడిపడి ఉంది. అందుకే లేటెస్ట్ టెక్నాలజీ పై మిమ్మల్ని మీరు అప్ గ్రేడ్ చేసుకోండి… కానీ ప్రజల నాడిని పట్టుకోవడం మరిచిపోవద్దన్నారు. ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో చాలా మంది చనిపోతున్నారని మీకు తెలుసు. గుండె జబ్బులను నివారించే మిషన్ లో మనమందరం భాగస్వాములం అవుదాం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మనమందరం కలిసి పనిచేద్దాం. ఉదాహరణకు… విద్యార్థులకు సీపీఆర్ బోధించడానికి మీరు స్వచ్ఛందంగా ముందుకు రాగలిగితే… మన దేశంలో చాలా మంది ప్రాణాలను కాపాడగలం. చాలా సార్లు మనం నివారణ గురించి నిర్లక్ష్యం చేస్తుంటాం కానీ ప్రజలకు అవగాహన కల్పించగలిగితే సమాజం ప్రయోజనం పొందుతుంది. క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ గురించి అంతా కృషి చేయాలని మీ అందరినీ కోరుతున్నా. ఆరోగ్య సంరక్షణలో మనం వరల్డ్ బెస్ట్ అవ్వాలని, ప్రతి ఒక్కరూ ఉత్తమ వైద్యుడుగా ఎదిగేందుకు ప్రయత్నించాలని కోరుకుంటున్నానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





