విద్యార్థులు మంచి దృక్పథాన్ని అల‌వ‌ర‌చుకోవాలి

– సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి
– కిట్స్‌లో జాతీయస్థాయి కార్నివాల్ ‘సంస్కృతి-26’

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 6: మీ కలల్లో రాణించండి.. సోషల్ మీడియా అసంబద్ధమైన అంశాలకు అలవాటుపడకండి.. తాజా సాంకేతికతలను ఆస్వాదించండి.. మంచి దృక్పథాన్ని అల‌వ‌ర‌చుకోవాలి అంటూ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, కిట్స్ పూర్వ విద్యార్థి ప్రశాంత్ ఆర్ విహారి విద్యార్థులకు ఉద్బోధించారు.
కిట్స్ కళాశాల మ్యూజిక్ డ్యాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ (ఎండిఎఫ్) క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్) ‘సంస్కృతి-26’ పేరుతో జాతీయస్థాయి సాంస్కృతిక కార్నివాల్‌ను శుక్ర, శనివారాల్లో నిర్వహిస్తోంది. మొదటి రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రశాంత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సాహభరితమైన దీక్ష మీ జీవితంలో విజయానికి మొదటి మెట్టు.. సాంస్కృతిక, సహ-పాఠ్య కార్యకలాపాల్లో పాల్గొనాలని సూచించారు. కిట్స్ వరంగల్‌లో గొప్ప విలువల వ్యవస్థ అభివృద్ధి చెందిందని, కళాశాల అందించే సౌకర్యాలను ఉపయోగించుకోవáడం ద్వారా లక్ష్యాన్ని సాధించిన తాను నిజమైన ఉదాహరణ అని చెప్పారు. ‘సాక’లోని 11 విద్యార్థి కార్యకలాపాల క్లబ్‌ల అద్భుతమైన పనితీరును ఆయన ప్రశంసించారు. రోజూ కొన్ని క్రీడలు, కళలను వాస్తవికతతో, మంచి దృక్పథంతో ఎంచుకోవాలని సూచించారు. కళాశాల చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి.నారాయణ రెడ్డి, నిర్వహణ సభ్యులు ఇ.వెంకట్రామ్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యాపక బృందాన్ని, విద్యార్థినీవిద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి విద్యార్థులు సాంస్కృతిక వైవిధ్యం ప్రపంచానికి అనుసంధానమవుతారని అన్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమాల్లో మొదటి రోజు ఇండో-వెస్ట్రన్ దినోత్సవం, ఎలిగంటికా (ఫ్యాషన్ షో), రెండవ రోజు సాంప్రదాయ బీట్స్, ప్రముఖ గాయని ఇ.మనీషాచే ప్రో షో ఉంటాయన్నారు. లైవ్ పెయింటింగ్, గానం, డ్రామా, ఫేస్ పెయింటింగ్, కన్ఫెషన్స్ వంటి 20కి పైగా స్పాట్ ఈవెంట్‌లు నిర్వహించారు. 

కిట్స్ అదనపు కార్యదర్శి, ఇన్‌చార్జి కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ అధ్యక్షోపన్యాసంలో విద్యార్థులు సంగీతం వినడం, పుస్తక పఠనం, సానుకూల దృక్పథం అలవరచుకోవాలన్నారు. మంచి ఆలోచనలు నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయని, నాణ్యమైన విద్యనందించడం ద్వారా కిట్స్ తన విద్యార్థులను సాంకేతికంగా ఉన్నతంగా, నైతికంగా బలంగా మార్చడానికి కృషిచేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో చీఫ్ ప్యాట్రన్, చైర్‌పర్సన్ సంస్కృతి-26 అండ్ డీన్ విద్యార్థి వ్యవహారాలు ప్రొఫెసర్ కె.శ్రీధర్, కన్వీనర్ సంస్కృతి-26, డాక్టర్ పి.ఎస్.ఎస్.మూర్తి, ఫ్యాకల్టీ ఇన్‌చార్జి ఎండిఎఫ్ క్లబ్ డాక్టర్ టి.శిరీష, వివిధ విభాగాల డీన్‌లు, వివిధ విభాగాల అధిపతులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పీఆర్వో డాక్టర్ డి.ప్రభాకరాచారి, ఎండిఎఫ్ క్లబ్ బి.టెక్ చివరి సంవత్సరం విద్యార్థి, ఐటి విభాగం, అధ్యక్షురాలు ఎన్.సంహిత, ఉపాధ్యక్షురాలు పి.శ్రీలాస్య, సంస్కృతి-26 కార్యక్రమం విద్యార్థి ప్రతినిధులు, పిఎంసి క్లబ్ అధ్యక్షుడు జి.సాయిసుమంత్, కె.సాయి ధనుష్ రెడ్డి, సాయిసాత్విక్ (పోస్టర్ డిజైనర్), వైష్ణవి డిస్కో క్లబ్‌పాటు డిస్కో క్లబ్, అధ్యాపక సభ్యులు, విద్యార్థినీవిద్యార్థులు, సాక్ సభ్యులు, విద్యార్థి ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *