హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో ప్రభుత్వ గురుకుల, ఆశ్రమ పాఠశాలల పరిస్థితితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. నాణ్యత లేని, కలుషిత ఆహారం పెడుతున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచుగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలతో వందలాదిమంది విద్యార్థినులు అస్వస్థతకు గురై దవాఖానల పాలవుతున్నారు. ఇటీవలే నాగర్‌కర్నూల్ సంఘటన మరవకముందే జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడురు గిరిజన బాలికల వసతి గృహంలో విద్యార్ధినులు ఆందోళన బాట పట్టారు. కలుషిత ఆహారం పెడుతున్నారని ఆరోపిస్తూ తరగతులు బహిష్కరించి రోడ్డెక్కారు. మంచి ఆహారం పెట్టి, కనీస వసతులు కల్పించాలని, ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



