కామారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 4: తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న వర్సిటీలోని సౌత్ క్యాంపస్ వసతి గృహంలో మంగళవారం అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. హోలీ సంబరాల అనంతరం సీనియర్, జూనియర్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ కొట్లాటలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వర్సిటీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థులను చెదరగొట్టారు. అనంతరం గాయపడిన వారికి చికిత్స అందించారు. వసతి గృహం వద్దకు స్థానిక ఎస్సై ఆంజనేయులు, వార్డెన్ డాక్టర్ యాలాద్రి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




