విద్యార్థుల అభివృద్ధికి ‘సాక్‌’ దోహదం

– ప్రిన్సిపాల్‌ కె.అశోకరెడ్డి ఉద్బోధ
– కిట్స్‌ వరంగల్‌లో కొత్త కార్యవర్గం ఏర్పాటు

వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ వరంగల్‌ (కిట్స్‌ వరంగల్‌-కిట్స్‌డబ్ల్యు) ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌(సాక్‌) కొత్త కార్యవర్గం ఎంపికైంది. కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.అశోక రెడ్డి కిట్స్‌ వరంగల్‌ ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలన చేసి మంగళవారం ప్రారంభించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, కిట్స్‌ వరంగల్‌ గవర్నింగ్‌ బాడీ చైర్మన్‌ కెప్టెన్‌ వి.లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి.నారాయణ రెడ్డి, కిట్స్‌ వరంగల్‌ అదనపు కార్యదర్శి, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌ కుమార్‌ నూతన సాక్‌ బృందాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ అశోక రెడ్డి మాట్లాడుతూ విద్యా సంవత్సరంలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సాక్‌ కార్యకలాపాలను క్రమపద్ధతిలో ప్లాన్‌ చేయడం, అమలు చేయడం ఒక ముఖ్యమైన సవాలు అంటూ విద్యార్థులు అదనపు పాఠ్యాంశాలు, కోకరిక్యులం కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఇది సమస్య పరిష్కార సామర్థ్యాలను, నాయకత్వ నైపుణ్యాలను, విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందన్నారు. విద్యార్థి వ్యవహారాల డీన్‌ ప్రొఫెసర్‌ ఎం.శ్రీలత మాట్లాడుతూ విద్యార్థుల అధునాతన సాంకేతిక, మానవతా నైపుణ్యాలు, నైతిక విలువలను ప్రదర్శించేందుకు ఇదొక వేదిక అని అన్నారు. స్టార్టప్‌ సంస్కృతిని అమలు చేయడానికి ఇంటర్‌ డిసిప్లినరీ ప్రాజెక్ట్‌ పనిని చేపట్టాలని, ఆవిష్కరణ, వ్యవస్థాపకత అభివృద్ధి కోసం వాస్తవ ప్రపంచానికి సంబంధించిన కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. మల్టీ డిసిప్లినరీ రంగాలలో కొత్త సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థులు తప్పనిసరిగా నేర్చుకునే యాజమాన్యాన్ని కలిగి ఉండాలన్నారు. ఎస్‌ఏసీలో మ్యూజిక్‌, డ్యాన్స్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఎండీఎఫ్‌), ఫొటోగ్రఫీ అండ్‌ మీడియా క్లబ్‌ (పీఎంసీ), హ్యుమానిటీ క్లబ్‌, ఎన్‌సీసీ క్లబ్‌, ఎన్‌ఎసఎస్‌ క్లబ్‌, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ క్లబ్‌, లిటరరీ క్లబ్‌, టెక్నికల్‌ క్లబ్‌, డిసిప్లినరీ క్లబ్‌ వంటి (9) క్లబ్‌లు, ఐఎస్‌టీఈ స్టూడెంట్‌ చాప్టర్‌ ఉంటాయి. ఈ కార్యక్రమంలో డీన్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ ప్రొఫెసర్‌ ఎం.శ్రీలత, అసోసియేట్‌ డీన్‌ విద్యార్థి వ్యవహారాలు, ఎం.నరసింహారావు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ అండ్‌ అర్‌ఓ డాక్టర్‌ డి.ప్రభాకరాచారి (ఫ్యాకల్టీ ఇన్‌చార్జి పీఎంసీ క్లబ్‌), వివిధ విభాగాల అధిపతులు, వివిధ విభాగాల డీన్‌లు, ఫ్యాకల్టీ ఇన్‌చార్జిలు కెప్టెన్‌ డాక్టర్‌ ఎం.రణధీర్‌ కుమార్‌ (ఎన్‌సిసి క్లబ్‌), డాక్టర్‌ సిహెచ్‌.సతీష్‌చంద్ర, సంతోష్‌ బార్గవి (ఎన్‌ఎస్‌ఎస్‌ క్లబ్‌), ఎస్‌.రమేష్‌ (లిటరరీ క్లబ్‌), డాక్టర్‌. సి.శ్రీనివాస్‌ రావు (హ్యూమానిటీ క్లబ్‌), హెడ్‌, పిఇడిఎమ్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ రెడ్డి (స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ క్లబ్‌), డాక్టర్‌ బి.విజయ్‌ కుమార్‌ (టెక్నికల్‌ క్లబ్‌), డాక్టర్‌ పి.నాగార్జున రెడ్డి (డిసిప్లినరీ క్లబ్‌), డాక్టర్‌ బి.విజయ్‌ కుమార్‌ (టెక్నికల్‌ క్లబ్‌), డాక్టర్‌ పి. నాగార్జున రెడ్డి (డిసిప్లినరీ క్లబ్‌), ఎండి ఆఫ్‌ క్లబ్‌- డాక్టర్‌ పి.ఎస్‌.ఎస్‌ మూర్తి, డాక్టర్‌ సిహెచ్‌..శ్రీదేవి రెడ్డి, స్టూడెంట్‌ కోఆర్డినేటర్‌, ఎండీఎఫ్‌ క్లబ్‌ వంటి వివిధ క్లబ్‌ల విద్యార్థి ప్రధాన కార్యదర్శులు ఎన్‌.సమిత, పియంసి జి.సాయి సుమంత్‌, హ్యుమానిటీ క్లబ్‌ పి.వైష్ణవి రెడ్డి, ఎన్‌సిసి క్లబ్‌ టి.సాయిచరణ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ క్లబ్‌ ఎన్‌.శివ దీపక్‌, డిస్కో క్లబ్‌ జి.సరయు, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ క్లబ్‌ టి.కార్తీక్‌, కె.విశాల్‌ ఆదిత్య, టెక్నికల్‌ క్లబ్‌ కె.శశికాంత్‌, లిటరరీ క్లబ్‌ పి.శ్రీతేజ, కిట్స్‌ వరంగల్‌ నుండి విద్యార్థులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *