విద్యార్థి అనుమానాస్పద మృతి

హన్మకొండ , ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23:‌ హన్మకొండ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. నయీమ్‌ ‌నగర్‌ ‌ప్రాంతంలో ఉన్న  ఓ ప్రైవేట్‌  ‌స్కూల్‌లో  సర్జీత్‌ ‌ప్రేమ్‌ అనే నాలుగో తరగతి విద్యార్థి అనుమాస్పద స్థితిలో మృతిచెందాడు. తల్లిదండ్రులకు తెలియకుండా పాఠశాల సిబ్బంది చికిత్స కోసం ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. హాస్పిటల్‌కి వొచ్చేలోపే బాలుడు బ్రెయిన్‌ ‌డెడ్‌ అయ్యాడని, తలనొప్పి కారణంతో హాస్పిటల్‌కి తీసుకొచ్చారని తెలిపారు వైద్యులు. అయితే  ఎటువంటి లక్షణాలు లేకుండా బ్రెయిన్‌ ‌డెడ్‌ ఎలా అయ్యాడంటూ పాఠశాల ముందు విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాఠశాల ముందు పోలీసులు భారీగా మోహరించారు .


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *