సమాజంలో మార్పునకు విద్యార్థి ఉద్యమమే నాంది

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల
– ఎన్ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: చదువు నేర్పిన వివేకం పోరాట పటిమగా మారినప్పుడే దేశ చరిత్ర మారుతుంది.. సమాజంలో ఏ విప్లవాత్మక మార్పు రావాలన్నా దానికి విద్యార్థి ఉద్యమమే తొలి అడుగు.. ఇది చరిత్ర నిరూపించిన సత్యం అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అక్షరాన్ని ఆయుధంగా మలచుకొని, వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే ఆ చారిత్రక ‘తొలి అడుగు’కు దశాబ్దాలుగా ఒక శక్తిమంతమైన వేదికగా నిలుస్తోంది ఎన్ఎస్‌యుఐ అని కొనియాడారు. దశాబ్దాలుగా విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతూ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ దేశానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించడంలో అది పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని, స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. ఎనఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వేచ్ఛ, సమానత్వం, లౌకికవాదమే ప్రాతిపదికగా విద్యార్థి లోకాన్ని ముందుకు నడిపిస్తున్న కార్యకర్తలందరికీ తన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. విజ్ఞానం కేవలం వ్యక్తిగత ఉన్నతికే కాదు.. సామాజిక విముక్తికి దారి చూపాలన్నారు. విలువల కోసం నిలబడే తత్వంతో ప్రతి విద్యార్థీ నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *