విద్యార్థి దత్తత గొప్ప కార్యక్రమం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కితాబు

జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 28: ‌పేద విద్యార్థుల అభ్యున్నతికి చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌పేర్కొన్నారు. పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గొల్లపల్లి గణేష్‌ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థుల సంక్షేమానికి విద్యార్థి దత్తత కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు.  ధర్మపురి పట్టణంలో శనివారం విద్యార్థి దత్తత కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అనేక విద్యాభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాములు, స్థానిక ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్‌, ‌గాదె శ్రీనివాస్‌, ‌పెండ్యాల మహేందర్‌, ఎంఈఓ ‌సీతాలక్ష్మి నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *