భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

– రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని, వాటి పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సచివాలయంలోని తన కార్యాలయంలో సహచర మంత్రి మహ్మద్‌ అజారుద్దీన్‌, జూబ్లీహిల్ల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌తో కలిసి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, శ్మశానవాటికలు తదితర అంశాలపై సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో బోరబండ, ఎర్రగడ్డ, షేక్‌పేట్‌ ప్రాంతాల్లో దశాబ్దాలుగా మైనార్టీలు స్మశానవాటికలు లేక ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యను వీలైనంత త్వరగా రక్షణ, రెవెన్యూ శాఖల, వక్ఫ్‌బోర్డ్‌ సమన్వయంతో అధిగమించాలని అధికారులకు సూచించారు. అవసరమైనచోట రెవెన్యూ భూమిని రక్షణ శాఖకు బదలాయించి వారి నుంచి ప్రత్యామ్నాయంగా భూమి తీసుకోవాలని, అలాగే రెవెన్యూ భూమిని వక్ఫ్‌ బోర్డుకు అప్పగించాలని సూచించారు. పేదల సంక్షేమం, ప్రజావసరాలు, అభివృద్ది కార్యక్రమాల కోసం వినియోగించాల్సిన ప్రభుత్వ భూములను కొద్దిమంది స్వార్ధప్రయోజనాల కోసం కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తుంటారని, ఇలాంటి వాటిని ఎట్టిపరిస్దితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఆక్రమణలను గుర్తించిన వెంటనే నోటీసులు జారీ చేసి అవసరమైతే ఖాళీ చేయించి ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలని, వివాదాల్లో ఉన్న భూముల పరిరక్షణకు న్యాయపరంగా గట్టిగా వ్యవహరించాలని కలెక్టర్లకు సూచించారు. సమావేశంలో టీఎంఆర్‌ఈఐఎస్‌ వైస్‌ చైైర్మన్‌ ఫహీం ఖురేషి, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.షఫీఉల్లాప్‌ా, హైదరాబాద్‌, మేడ్చల్‌ కలెక్టర్లు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *