– డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14: సోషల్ మీడియా వేదికగా సాగుతున్న వ్యక్తిత్వ హననం, అసభ్యకర పోస్టులపై డీజీపీ శివధర్ రెడ్డి బుధవారం కీలక ప్రకటన చేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లడం, కుటుంబ సభ్యులను కించపరచడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన నాటినుండే ఈ అంశంపై అత్యంత కఠినంగా వ్యవ హరిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ (శీలహననం) చేస్తూ పోస్టులు పెట్టే వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా రాజకీయ లేదా ఇతర విభేదాల కోసం ప్రత్యర్థుల కుటుంబ సభ్యులను లక్ష్యం చేసుకోవడం నేరమని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్కులేట్ చేయడం, అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేసే వారిపై నిఘా ఉంచామని ఆయన హెచ్చరించారు. చట్టానికి లోబడి, గౌరవప్రదంగా చేసుకునే విమర్శల పట్ల పోలీసులకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ బహిరంగంగా వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





