– పోష్ చట్టంపై అవగాహన కల్పించిన అనితా రెడ్డి
హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 17ః పోష్ చట్టంపై గ్రామస్థాయి నుండి జిల్లాస్థాయి వరకు అవగాహన అవసరం అని , అందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోష్ కమిటీ కన్వీనర్, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు , పోష్ చట్టం -2013 ప్రివెన్షన్ ఆఫ్
సెక్చువల్ హెరాస్ మెంట్‌పై అవగాహన కలిగించడం ద్వారా మహిళలు పని ప్రదేశాలలో ఏ ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనే మానసిక స్థయిర్యం కలుగుతుందన్నారు. పోష్ చట్టంపై అవగాహన కార్యక్రమాలు, కార్యాలయాలలో అంతర్గత ఫిర్యాదు కమిటీ- పోష్ కన్వర్జెన్సి మీటింగ్స్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టాల పై అవగాహన ఉన్నప్పుడే వాటిని వినియోగించుకోగలుగుతారన్నారు, ఇది మహిళలకు ఎంతగానో ఉపయోగకరమని అన్నారు. మహిళలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసినపుడు ఈ చట్టం ్రపకారం వారి పేర్లు గోప్యంగా ఉంచుతారన్నారు. మహిళలు వేధింపులకు గురైనప్పుడు మౌనంగా ఉండ కుండా ధైర్యంగా సమాధానం చెప్పి ఎదుర్కొనే స్ధాయికి చేరాలన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాలలో, హస్పిటల్స్, స్కూల్స్, కాలేజిలు, వాణిజ్య, వ్యాపార సంస్థలలో సైతం ఈ కమిటీ నిఏర్పాటు చేయాలని సూచించారు .పని ప్రదేశాలలో స్త్రీ లకు రక్షణ తో కూడిన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని, అది చట్టంలో పొందుపరచి ఉందని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు,. ఈ చట్టం గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఏ మహిళ అయినా పని ప్రదేశాలలో ఎలాటి ఇబ్బంది ఎదుర్కొన్నా తమకు తెలియజేయవచ్చునని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





