వయోవృద్ధులను వేధిస్తే కఠిన చర్యలు

– హన్మకొండ డిస్ట్రిక్ట్‌ జడ్జి డాక్టర్‌ పట్టాభి రామారావు

హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ట్రిబ్యునల్‌ బెంచ్‌ సీనియర్‌ సిటిజన్స్‌కు వరం అని, వారికి ఏ సమస్య వచ్చినా ట్రిబ్యునల్‌ బెంచ్‌కు ఫిర్యాదు చేయవచ్చని హన్మకొండ జిల్లా జడ్జి డాక్టర్‌ కె.పట్టాభిరామా రావు తెలిపారు, డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీ హన్మకొండ ఆధ్వర్యంలో డాక్టర్‌ అనితా రెడ్డి అధ్యక్షతన హన్మకొండలోని స్వయంకృషి వృద్ధాశ్రమంలో సీనియర్‌ సిటిజన్స్‌ చట్టంపై అవగాహన, ఆత్మీయ స్పర్శ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా డాక్టర్‌ పట్టాభిరామారావు, గౌరవ అతిథిగా సీనియర్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ కోర్టు మెంబర్‌, అనురాగ్‌ సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ అనితా రెడ్డి, డీఎల్‌ఎస్‌ఏ జడ్జి రామలింగంలు ప్రారంభించారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు వయోవృద్దుల చట్టం, ట్రిబ్యునల్‌ కోర్టు గురించి అవగాహన కల్పించారు, వయోవృద్దులను వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయని జడ్జి డాక్టర్‌ పట్టాభి రామారావు అన్నారు. ఆత్మీయంగా అందరినీ పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, తల్లిదండ్రుల బాధ్యత కచ్చితంగా పిల్లలదేనని, దాన్ని విస్మరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు, వృద్ధులకు తగిన గౌరవం, ప్రేమ అందించాలన్నారు. డాక్టర్‌ అనితా రెడ్డి మాట్లాడుతూ వయోవృద్దుల చట్టం, ట్రిబ్యునల్‌ బెంచ్‌ పట్ల ఇంకా ప్రజల్లో సరౖుెన అవగాహన లేదని, గ్రామస్ధాయి నుండి నగరస్ధాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు, వృద్ధాప్యం ఎవరికీ శాపంగా మారకూడదని అన్నారు, తమకు ఏ చట్టాలు ఉన్నాయి అనేది తెలిసికొని తమ హక్కులు వినియోగించుకోవాలంటూ సీనియర్‌ సిటిజన్స్‌ చట్టంపై ఆమె అవగాహన కల్పించారు ఇలా డిస్ట్రిక్ట్‌ జడ్జి వృద్ధాశ్రమానికి వచ్చి న్యాయ భరోసాను, ఆత్మీయ స్పర్శను అందించడం ఇదే మొదటిసారి అని అభినందించారు. డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసు అధారిటీ జడ్జి రామలింగం మాట్లాడుతూ అవసరార్థులకు ఉచిత న్యాయ సదుపాయాలు అందిస్తామన్నారు. వృద్ధులను గౌరవించడం, ప్రేమించడం మన సంస్కారమన్నారు, తల్లిదండ్రులను ప్రేమించని వారు, ఇబ్బంది పెట్టే వారు ఎంతటి కోటీశ్వరులైనా దరిద్రులతో సమానమన్నారు. వృద్ధులకు ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీస్‌ అధారిటీ హన్మకొండ జిల్లా పక్షాన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. స్వయంకృషి వృద్ధాశ్రమం నిర్వహకులు శుభ, వృద్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *