విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రజా ప్రభుత్వం కృషి

– ఓయూకు నిధుల కేటాయింపుపై ఎమ్మెల్యే నాయిని హర్షం 
-కేయూకు కూడా నిధుల మంజూరుకు చొరవ 
– ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

కాకతీయ విశ్వవిద్యాలయం/హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రూ.1000 కోట్లు మంజూరు చేయడాన్ని ప్రశంసిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయానికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు. విద్యావ్యవస్థ మరింత బలోపేతానికి ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కలిసి సమిష్టిగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. కాకతీయ విశ్వవిద్యాలయ గెస్ట్‌ హౌస్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్ల సంఘం ‘కుర్తా’, రిటైర్డ్‌ నాన్‌-టీచింగ్‌ ఉద్యోగుల సంఘం ఆహ్వానంపై విశ్వవిద్యాలయానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తర తెలంగాణ విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలను బలోపేతం చేయాలని విశ్రాంత ఆచార్యులు, ఎన్జీవో సంఘ ప్రతినిధులు కోరారు. రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని స్పష్టం చేశారు.
యూనివర్సిటీ పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి చూపిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు సదానందం, కూరపాటి వెంకట్‌ నారాయణ, రవీందర్‌, ఎర్రగట్టు స్వామి, ఎర్రం రామ్‌ రెడ్డి, సమ్మయ్య, కందకట్ల సుధాకర్‌, విశ్రాంత ఉద్యోగ సంఘ నాయకులు నాగేశ్వరరావు, కృష్ణమాచారి, ప్రభాకర్‌, మల్లయ్య, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *