స‌నాత‌న యోధుడి వ్యూహాత్మ‌క మౌనం!!

“ఎంతో జాగ్ర‌త్త‌గా స‌నాత‌న యోధుడిగా త‌న‌ను తాను ప్ర‌ద‌ర్శించుకుంటున్న ప‌వ‌న్ క‌ళ్యాన్  ఇప్పుడు త‌న సొంత‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటుండంలో తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు ఒక ప్ర‌భుత్వ ఉద్యోగిని గ‌త 18 నెల‌లుగా స‌ద‌రు ఎమ్మెల్యే వేధింపుల‌కు గురిచేస్తున్నాడంటూ, అత‌ని సంభాష‌ణ‌ల‌కు సంబంధించిన వీడియోను విడుద‌ల చేయ‌డంతో దుమారం రేగింది. విచిత్ర‌మేమంటే ఈమ‌ధ్య‌నే జ‌న‌సేన పార్టీ ఒక ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పార్టీ నాయ‌కులు విప‌క్షాల కుట్ర‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలని , ముఖ్యంగా వివాహేత‌ర సంబంధాల ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయాల‌ని చూస్తార‌న్న‌ది దాని సారాంశం. “
శామ్ సుందర్ 

 దైవిక స్ఫూర్తి నిండిన‌వాడిగా పైకి క‌నిపించే ఒక నాయ‌కుడిలో దాగివున్న ప‌ర‌స్ప‌ర వైరుధ్య‌త‌ల‌ను బ‌య‌ట‌ప‌డ‌నీయ‌కుండా రాజ‌కీయాధికారం కాపాడుతుంది. కానీ అదే నాయ‌కుడు, పైకి క‌నిపించే త‌న నైతిక అభిన‌యానికి, నిజ ప్ర‌వ‌ర్త‌న భిన్నంగా లేకుండా జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే క‌చ్చితంగా అది క‌ప‌టత్వ‌మే అవుతుంది. ప్ర‌జాభిప్రాయాన్ని అనుకూలంగా మ‌ల‌చుకునే రీతిలో ఒక న‌య‌వంచ‌క వ్య‌వ‌హార‌శైలి వ‌ర్త‌మాన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అభివ్య‌క్త‌మ‌వుతుండ‌టం విచిత్రం. ఒక నాయ‌కుడు ధైర్యంగా నిస్సిగ్గుగా త‌న‌లోని ప‌ర‌స్ప‌ర వైరుధ్యాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ప్పుడు ఎంతోకాలం వీటిని లోపాలుగా ప‌రిగ‌ణించ‌డం వుండ‌దు. పైగా వీటిని ఆమోద‌యోగ్య‌మైన, అసాధార‌ణ నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలుగా ప‌రిగ‌ణించ‌డం జ‌రుగుతుంది.

ప్ర‌స్తుతం లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న‌ జ‌న‌సేన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే విష‌యంలో పార్టీ అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాటిస్తున్న నిరంత‌ర మౌనంలోని వివేచ‌న ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో తాను న‌టించిన చిత్రం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వేదిక‌మీద‌కు వ‌స్తున్న సంద‌ర్భంలో నిర్వాహ‌కులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఓజీ, పీకే అని పిలుస్తూ ఆకాశానికెత్తేశారు. అప్పుడు ఆయ‌న ఒక యోధుడి శైలిలో జ‌పాన్ ఆయుధం కాట‌న‌ను ఊపుతూ స్టైలిష్‌గా ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో క‌నిపించారు. ఆయ‌న అభిమానుల‌కు అదొక సినిమాటిక్ ప్ర‌ద‌ర్శ‌న మాత్ర‌మే కాదు స‌నాత‌న స్ఫూర్తితో, సంస్కృతితో పాటు మ‌హిళ‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డిన ఒక యోధుడు ఝుళిపించిన క‌త్తి! ఇప్పుడు స‌నాత‌న‌ధ‌ర్మాన్ని,  స‌మురాయ్ (యోధుడు)తో క‌లిపేసే సైద్ధాంతిక‌త అనేది ఒక సంక్టిష్ట ప్ర‌హేళిక అయిన‌ప్పుడు, దీన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్  రాజ‌కీయ కోణంలో ప్ర‌ద‌ర్శించే ఒక చ‌మ‌త్కారంగా చూడాలి.

2024 సంవ‌త్స‌రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌ను తాను ఒక బ‌ల‌మైన ర‌క్ష‌కుడిగా ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌డానికి య‌త్నించారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త మెరుగుప‌డ‌క‌పోతే ఏకంగా హోంశాఖ‌నే త‌న ఆధీనంలోకి తీసుకుంటాన‌ని  త‌న‌తో పాటు ప్ర‌భుత్వంలో భాగంగా వున్న హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌ను గ‌ట్టిగా హెచ్చ‌రించారు కూడా! అంతేకాదు రాజీలేని ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించ‌డంలో న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించే ఉత‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ను అనుస‌రిస్తాన‌ని కూడా హెచ్చ‌రించారు.
ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో ఆయ‌న గ్రామ వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా చాలా దూకుడుగా మాట్లాడారు. ముఖ్యంగా 30వేల మంది మ‌హిళ‌ల అదృశ్యానికి ఈ వ్య‌వ‌స్థే కార‌ణ‌మంటూ అప్ప‌టి ఇంటెలిజెన్స్ నివేదిక‌ల‌ను ఆయ‌న ఉటంకించారు. అంతేకాదు ఈ వ్య‌వ‌స్థ మాన‌వ అక్ర‌మ ర‌వాణాకు దోహ‌దం చేసేదిగా ఉన్న‌ద‌ని కూడా విమ‌ర్శించారు.

ఎంతో జాగ్ర‌త్త‌గా స‌నాత‌న యోధుడిగా త‌న‌ను తాను ప్ర‌ద‌ర్శించుకుంటున్న ప‌వ‌న్ క‌ళ్యాన్  ఇప్పుడు త‌న సొంత‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటుండంలో తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు ఒక ప్ర‌భుత్వ ఉద్యోగిని గ‌త 18 నెల‌లుగా స‌ద‌రు ఎమ్మెల్యే వేధింపుల‌కు గురిచేస్తున్నాడంటూ, అత‌ని సంభాష‌ణ‌ల‌కు సంబంధించిన వీడియోను విడుద‌ల చేయ‌డంతో దుమారం రేగింది. విచిత్ర‌మేమంటే ఈమ‌ధ్య‌నే జ‌న‌సేన పార్టీ ఒక ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పార్టీ నాయ‌కులు విప‌క్షాల కుట్ర‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలని , ముఖ్యంగా వివాహేత‌ర సంబంధాల ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయాల‌ని చూస్తార‌న్న‌ది దాని సారాంశం. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే లైంగిక వేధింపుల ఆరోప‌ణ ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో, ఇటువంటిదేదో కొంప‌ముంచుతుంద‌న్న ఉద్దేశంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా రాజ‌కీయంగా స్వీయ ర‌క్ష‌ణ‌కోసం ఒక ప‌థ‌కం ప్ర‌కారం ఈ లేఖ‌ను విడుద‌ల చేసార‌న్న‌ది విమ‌ర్శ‌కుల వాద‌న‌.

యోగి శైలిలో ప‌నిచేస్తా, అవ‌స‌ర‌మైతే హోం మంత్రిత్వ‌శాఖ‌నే తీసుకుంటా అంటూ ఓజీ సినిమాలో చూపిన కాటన ఆయుధం కంటే ప‌దునైన ప‌ద‌జాలంతో ర‌క్తిక‌ట్టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు తానే పాల‌నాప‌ర‌మైన నిశ్చేష్ట‌త‌లో  ప‌డిపోయారు. త‌న పార్టీకి చెందిన స‌భ్యుడిపై చ‌ర్య తీసుకోవ‌డంలో  దారుణ వైఫ‌ల్యాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌డానికి ఆయ‌న క‌ప్ప‌దాటు ప్ర‌ద‌ర్శ‌న చేయాల్సి వ‌స్తున్న‌ది. మ‌హిళా హ‌క్కుల‌ ప‌రిర‌క్ష‌ణ‌కు కంక‌ణం క‌ట్టుకున్నానంటూ బ‌య‌ట ప్ర‌ద‌ర్శించిన‌ ఆర్భాటానికి, పార్టీ అంత‌ర్గ‌తంగా ఇప్పుడు జ‌రుగుతున్న‌దానికి పొంత‌నే లేక‌పోవ‌డంతో ఆయ‌న స‌నాత‌న స్ఫూర్తి కేవ‌లం రాజ‌కీయ ముసుగా లేక సార్వ‌జ‌నీక నైతిక దిక్సూచా? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మైంది. ఏపీ డిప్యూటీ ముఖ్య‌మంత్రి ఇప్ప‌టికైనా త‌న మౌనాన్ని వీడి పార్టీ అంత‌ర్గ‌తంగా స్వ‌తంత్ర విచార‌ణ జ‌రిపిస్తారా?  లేక న్యాయ విచార‌ణ ప్ర‌కియ పూర్త‌యిందాకా వేచివుంటారా? అన్న‌ది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *