28న సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ‘కథా కార్యశాల’

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : తెలంగాణ సాహిత్య అకాడమి ఒక రోజు ‘కథా కార్యశాల’ సదస్సు నిర్వహిస్తున్నది. ఈ సదస్సులో కథలు ఎలా రాయాలి?, కథా నిర్మాణ పద్ధతులు, కథలకు వస్తువులు ఎలా ఎంచుకోవాలి తదితర అంశాలపై ప్రముఖ కథకులు డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్, స్వర్ణ కిలారి, డాక్టర్ బి.వి.ఎన్ స్వామిలు మెలకువలు నేర్పిస్తారు. నేటితరం యువతను సాహితీవేత్తలుగా తీర్చిదిద్దాలని భావిస్తున్న సాహిత్య అకాడమీ ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందుకోసం ఉత్సాహవంతులైన యువతీయువకులు ఈ సదవకాశాన్ని ఊపయోగించుకోవాలని అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు మొబైల్ నంబరు 9182445692 ను సంప్రదించి వాట్సాప్ ద్వారా, ఫోన్ నంబరు, పేరు, వయస్సు, విద్య, వృత్తి, చిరునామా తదితర వివరాలు ఈనెల 23లోగా పంపించి ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే అవకాశం ఉంటుందన్నారు. 28న హైదరాబాదులో నిర్వహించే ఈ ‘కథా కార్యశాల’ వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *