ఇరాన్ పై దాడులు నిలిపివేయాలి

– దౌత్యమార్గాలరు కేంద్రం పరిశీలించాలి
– జమ్మూకాశ్మీర్ సిఎం ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్, మార్చి 27: ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు మహమ్మద్ యూసుఫ్ తరిగమి తీవ్రంగా ఖండించారు. ఈ సంఘర్షణను తక్షణమే నిలిపివేసి దౌత్య మార్గాల్లో పరిష్కారం కనుగొనాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఇతరుల హత్యలను ప్రస్తావిస్తూ, యుద్ధ విధానాన్ని సమర్థించలేమని స్పష్టం చేశారు. పిల్లలు సహా పౌరుల ప్రాణనష్టం, యుద్ధ ప్రభావాలు అసహ్యకరమని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల వెనుక ప్రకటించిన లక్ష్యాలపై ప్రశ్నలు లేవనెత్తిన అబ్దుల్లా, యుద్ధ ప్రభావాలు జమ్మూ కాశ్మీర్లో కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. ఇరాన్లో కొంతమంది భారతీయులు చిక్కుకుపోయారని, పెట్రోల్ పంపుల వద్ద పొడవైన క్యూలు ఏర్పడుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను ప్రభావితం చేసే అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీకి పూర్తి హక్కు ఉందని అన్నారు. ఇదే విషయంపై స్పందించిన మహమ్మద్ యూసుఫ్ తరిగమి, సంఘర్షణను ముగించడంలో కేంద్రం చురుకైన, నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. ఇరాన్తో భారతదేశానికి ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేస్తూ, దేశవ్యాప్తంగా యుద్ధ వ్యతిరేక స్వరాలు వినిపించాలని సూచించారు. పరిస్థితిని శాంతింపజేయ దానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *