జర్నలిస్టుల అక్రమ అరెస్టులు ఆపాలి

– వారిని వెంటనే విడుదల చేయాలి: ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు27:రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల అక్రమ అరెస్టులను బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. డెస్క్ ‌జర్నలిస్ట్‌ల న్యాయమైన పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ‘జీ.ఓ. 252 సవరణను డిమాండ్‌ ‌చేస్తూ ఆందోళనలు చేస్తున్న జర్నలిస్ట్‌లను అక్రమ అరెస్ట్ ‌చేయడాన్ని ఖండిస్తున్నాం. స్తున్నాం. జర్నలిస్టులకు కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 26,000 అక్రిడిటేషన్‌ ‌కార్డులు ఇచ్చారు. రిపోర్టింగ్‌ ‌జర్నలిస్టులు, డెస్క్ ‌జర్నలిస్టులు అనే బేధం లేకుండా అక్రిడిటేషన్‌ ‌కార్డులు ఇచ్చారు కేసీఆర్‌. ‌కానీ, రేవంత్‌ ‌రెడ్డి అక్రిడిటేషన్‌ ‌కార్డులను 10 వేలకు తగ్గిస్తామని చెప్పడం దుర్మార్గం. డెస్క్ ‌జర్నలిస్ట్‌లకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. సోషల్‌ ‌డియా, యూట్యూబ్‌ ‌జర్నలిస్టులను టెర్రరిస్టులుగా పోల్చడం దారుణం. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ ‌పూర్తిగా మద్దతు తెలుపుతుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల తరఫున కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని నిలదీస్తాం’ అని ఎమ్మెల్యే వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *