” జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కొట్లాడుతుంటే ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి బీజేపీ-ఎంఐఎం లతో దోస్తీ చేయడాన్ని, ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడడాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఎట్లా సమర్థించుకుంటుందో చూడాలి. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి మేలు చేయడానికి ఎంఐఎం ఒక పథకం ప్రకారంగా తమ అభ్యర్థులను నిలబెడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం చేస్తుందో బుద్దిజీవులందరికీ తెలిసిన విషయమే. మరి తెలంగాణాలో మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తో అంటకాగడం రాహుల్ గాంధీ ఎట్లా ఒప్పుకుంటున్నాడు?”
బీహార్ నుండి జూబ్లిహిల్స్ వరకూ ఒకే కథ

(బీఆర్ఎస్ జనగామ జిల్లా నాయకుడు)
బీహార్ రాష్ట్రం సాధారణ ఎన్నికలు, తెలంగాణా లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఊహించని విధంగా వెలువడిన ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బీహార్ లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసు శాఖ, ఇతర అధికార యంత్రాంగాలను భారీ స్థాయిలో మోహరించింది. ఇదే విధంగా, తెలంగాణాలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన అధికార, అంగ–అర్థ బలాలను వినియోగించి జూబ్లీహిల్స్ లో విజయం సాధించడం రెండు పార్టీలూ ఒకే నాణానికి రెండు వైపుల వంటివని నిరూపించాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో, మహారాష్ట్ర తదితర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం సహకారంతో “వోట్ చోరీ” ద్వారా అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు బీహార్ లో ఏకంగా “ఎలక్షన్ చోరీ చేయడానికి” సిద్ధపడిందని అందుకోసమే “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” (SIR) ను అమలుచేసిందని రాహుల్ గాంధీ బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం పైన తీవ్ర ఆరోపణలు చేశాడు.
SIR లో భాగంగా దాదాపు 60 లక్షల మంది ప్రజలను సెలెక్టివ్ గా వోటర్ జాబితా నుండి తొలగించారని, వారందరూ కాంగ్రెస్ అనుకూల వర్గాలకి, కులాలకి చెందినవారని రాహుల్ ప్రధాన ఆరోపణ చేయడమే కాకుండా మరణించారని, చిరునామా లేదని తదితర కారణాలతో వోటర్ లిస్టు నుండి తొలిగించిన వ్యక్తులను తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టి ప్రజాస్వామిక వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేసే విధానాలను బహిర్గతం చేసారు . అంతేకాదు రాహుల్ గాంధీ బీహార్ రాష్ట్రంలో “వోటర్ అధికారీ యాత్ర” పేరుతొ లక్షలాది ప్రజలచే ర్యాలీ చేసి ఆర్జేడీ-కాంగ్రెసుతో కూడిన మహాఘట్ బంధన్ అధికారంలోకి తప్పకుండా వస్తుందనే నమ్మకం బీహార్ ప్రజలతో పాటు దేశవ్యాప్త ప్రజాస్వామిక ప్రేమికులకు కల్పించాడు. కానీ ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఆరితేరిన బీజేపీ SIR, దొంగ వోట్లు, రిగ్గింగ్, ధనబలం తదితర అనేక దొంగదారుల్లో బీహార్ లో అధికారాన్ని నిలుపుకుంది.
సరిగ్గా బీహార్ లో బీజేపీ కూటమి చేసిన విధంగానే రాహుల్ గాంధీ ఆశయానికి, ఆలోచనలకు భిన్నంగా తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం దొంగదారుల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపొందింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సహకారంతో వేల సంఖ్యలో దొంగ వోట్లను నమోదు చేయడం దగ్గరనుండి మొదలుపెడితే పోలీసులు-రౌడీల సహకారంతో రిగ్గింగుకు పాల్పడి అనైతిక విజయాన్ని నమోదు చేసుకుంది. మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ కు విరుద్ధంగా ప్రజలను అనేక రకాలుగా అధికార కాంగ్రెస్ నాయకులు మభ్యపెట్టిన, బెదిరించిన విధానాలు బహిరంగంగానే కనబడుతున్నాయి. వోటుకు 2500 రూపాయలు పంచడం, చీరలు, కుక్కర్లు, మందు, మాఫియా తదితర ఎన్ని ప్రయోగించాలో అన్ని ప్రయోగించి ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ గెలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఏ ఉపఎన్నికలో ఏ ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించని విధంగా కాలుకు బలపం కట్టుకుని ప్రచారం నిర్వహించి కాంగ్రెసుకు వోటు వేయకపోతే పథకాలు అమలును నిలిపివేస్తామని బెదిరించడం కాంగ్రెస్ దిగజారుడుతనాన్ని తెలియజేస్తుంది.
ఓవైపు జతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కొట్లాడుతుంటే ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి బీజేపీ-ఎంఐఎం లతో దోస్తీ చేయడాన్ని, ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడడాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఎట్లా సమర్థించుకుంటుందో చూడాలి. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి మేలు చేయడానికి ఎంఐఎం ఒక పథకం ప్రకారంగా తమ అభ్యర్థులను నిలబెడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం చేస్తుందో బుద్దిజీవులందరికీ తెలిసిన విషయమే. మరి తెలంగాణాలో మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తో అంటకాగడం రాహుల్ గాంధీ ఎట్లా ఒప్పుకుంటున్నాడు? కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సహజ శత్రు పార్టీ. కానీ తెలంగాణాలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న సంగతి రాజకీయ పరిజ్ఞానం తెలియని పిల్లవాడికి కూడా అర్థం అవుతుంది. కేవలం ఒక ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఇటువంటి అనైతిక స్నేహాలు, పొత్తులు కుదుర్చుకోవడం, దౌర్జన్యాలకు, రిగ్గింగులకు పాల్పడడం చూస్తుంటే కాంగ్రెస్-బీజేపీ-ఎంఐఎం ఏదయినా అవగాహన ఒప్పందంలో ఉన్నాయా అనే అనుమానం కలుగక మానదు.
వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల కారణంగానే తప్ప బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత వల్ల కాదనేది ఇది వరకే స్పష్టమయింది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అని తేడా లేకుండా ఎవరిని పలకరించిన కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను ప్రకటిస్తారు. కాబట్టే జూబ్లీహిల్స్ గెలుపు ఇన్ని అనుమానాలకు అవకాశం ఇస్తుంది. అనుమానాలకు రుజువులు కూడా అనేకం ఇప్పటికే బయటపడ్డాయి. ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ప్రభుత్వం కూలిపోతుందని భయంతోనో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు పోతుందనే భయంతోనో ఈ అనైతిక పద్దతులకు కాంగ్రెస్ పాల్పడిందనేది స్పష్టంగా తెలుస్తుంది.
ఇంతకు ముందు చెప్పినట్టు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతే జరిగే నష్టం పెద్దగా ఏమీ ఉండదు కానీ, కాంగ్రెస్ కు మాత్రం ఊపిరి పీల్చుకునే సమయం దొరుకుతుంది అన్నట్టు కాంగ్రెసుకు ఇప్పుడు ఊపిరి తీసుకునే సమయం వచ్చింది. ఇది ఎంతకాలమూ ఉండకపోవచ్చు. బీఆర్ఎస్ ఇప్పటికీ సంస్థాగతంగా, ఆర్థికంగా, రాజకీయంగా చాలా బలంగా ఉన్నది. అతి త్వరలో వచ్చే స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి మరింత కసిగా పని చేయడానికి ఈ ఉపఎన్నిక ఉపయోగపడుతుంది. కాంగ్రెసు కు మాత్రం స్థానిక ఎన్నికలు, ఆ తరువాత మున్సిపల్ ఎన్నికలు, పార్టీ ఫిరాయించిన వారిని స్పీకర్ ఒకవేళ సస్పెండ్ చేస్తే ఆ ఎన్నికలు మొత్తంగా దినదినగండంగానే గడపాల్సిన పరిస్థితి…





