– నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
ముంబయి, ఏప్రిల్ 7: అంతర్జాతీయ పరిస్థితుల అనిశ్చితి, ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో కీలక సూచీలు క్షీణించాయి. ఉదయం 9:24 గంటల సమయానికి సెన్సెక్స్ సుమారు 529 పాయింట్లు పడిపోయి 73,576 వద్ద ట్రేడవగా నిప్టీ 155 పాయింట్లు నష్టపోయి 22,813 వద్ద కొనసాగింది. ప్రారంభ దశలో సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా పడిపోవడం గమనార్హం. నిప్టీ సూచీలో హిందాల్కో, ఓఎన్‌జీసీ, విప్రో, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో నిలిచాయి. మరోవైపు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఎటర్నల్, ఐషర్ మోటార్స్, ఎంఅండఎం షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువు ముగియడానికి సమయం దగ్గర పడుతుండటంతో గ్లోబల్ మార్కెట్లలో ఉద్రిక్తత నెలకొంది. హర్మూజ్ జలసంధి అంశంపై పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయోనన్న అనిశ్చితి పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ప్రభావంతో ముడి చమురు ధరలు పెరుగుతూ బ్యారెల్‌కు 110 డాలర్లకు పైగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో రూపాయి విలువ కూడా బలహీనపడి డాలర్‌తో పోలిస్తే 93.07 వద్ద ట్రేడవుతోంది. మొత్తంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల దేశీయ మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతున్నాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం విదేశీ మదుపర్లు రూ.8 వేల కోట్లకుపైగా విలువైన షేర్లు అమ్మేశారు. అలాగే హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సవిÖపిస్తున్న వేళ పశ్చిమాసియా యుద్ధం ఏ క్షణాన ఏ మలుపు తీసుకుంటుందోననే ఆందోళన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. ఈ ఆందోళన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిప్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి. మంగళవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరో 500 పాయింట్లు కోల్పోయింది. తర్వాత కాస్త కోలుకుంది. ప్రస్తుతం ఉదయం 10:50 గంటల సమయంలో సెన్సెక్స్ 354 పాయింట్ల నష్టంతో 73,752 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిప్టీ కూడా నష్టాల బాటలోనే సాగుతోంది.సెన్సెక్స్, నిప్టీలో వేదాంత, హిందోల్కా, ప్రెస్టేజ్ ఎస్టేట్, విప్రో, ఎంఫసిస్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి. జుబిలెంట్ ఫుడ్స్, ఫోర్స్ మోటార్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, పీజీ ఎలక్టోప్లాస్ట్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిప్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 266 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిప్టీ 563 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.93గా ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.
