సోనియా చలవతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం

– ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం ఆమె మానస పుత్రికలు
– డిసెంబర్ 2027 నాటికి దేవాదుల పూర్తి
– వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి
– సన్న బియ్యం పంపిణీతో పేదల కళ్ళలో వెలుగులు
– కాళేశ్వరం బ్యారేజీలో సమగ్ర సాంకేతిక అధ్యయనం
– మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

వికారాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ చలవతోనే జరిగిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆమె మార్గదర్శనంలోనే కేంద్రంలో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. వికరాబాద్‌లో జరుగుతున్న డీసీసీ అథ్యక్షుల శిక్షణ తరగతులలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంతోపాటు సమాచార హక్కు చట్టం సోనియాగాంధీ మానస పుత్రికలుగా అభివర్ణించారు. యూపీయే చెర్‌పర్సన్ హోదాలో ఆమె మార్గదర్శనంలో రూపుదిద్దుకున్న ఈ రెండు చట్టాలు కోట్లాదిమందికి శక్తినిచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సాగునీటి విప్లవం మొదలైందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే పెండింగ్‌లో ఉన్న ఎసఎల్‌బిసి, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిలసాగర్, భీమాలతోపాటు డిసెంబర్ 2027 నాటికి దేవాదుల పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. ఎసఎల్‌బిసి పూర్తి చేసి నల్లగొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తామన్నారు. దేవాదుల పూర్తి చేసి 6.8 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు వరంగల్ నగరానికి తాగునీరు అందిస్తామన్నారు. అంతేగాÅ£ సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుల ద్వారా ఖమ్మం జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కాళేశ్వరం బ్యారేజీలో కొన్ని భాగాలు కూలిపోయిన నేపథ్యంలో సమగ్ర సాంకేతిక అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐఐటి నిపుణుల బృందాన్ని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. మరమ్మతులు చేపట్టాలా పునరుద్ధరణ జరపాలా అన్న అంశంపై అధ్యయనం కొనసాగుతోందన్నారు. దొడ్డు బియ్యాన్ని వినియోగించడంలో ప్రజలు అనాసక్తత చూపడంతో పక్కదారి పట్టి కోటాను కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా దొడ్డు బియ్యం సరఫరాపై సమగ్రమైన అధ్యయనం జరిపి అర్హులైన నిరుపేదలందరికీ ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ వంటి విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. 3.30కోట్ల మంది ప్రజల కళ్ళలో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. వరి కొనుగోలుతోపాటు ప్రజాపంపిణీ వ్యవస్థను పారదర్శకంగా రూపుదిద్దినట్లు ఆయన వెల్లడించారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రికార్డు స్థాయిలో 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించిందన్నారు. ధాన్యం కొనుగోలు కోసం 12,500 గ్రామ పంచాయతీలలో 8,860 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 50 లక్షల మంది రైతుల నుండి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. కొనుగోలు చేసిన 48 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలో నగదు జమ చేశామని, మద్దతు ధరతోపాటు ప్రభుత్వం సన్నాలకు ప్రకటించిన బోనస్‌ను కలుపుకుని రూ.20 వేల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. బీఆరఎస్ పాలనలో జరిగిన పోరపాట్లన్నింటినీ సరిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమై ఉందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *