పేదలకు అండగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం

-అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
-ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌

‌కరీంనగర్‌,‌ప్రజాతంత్రర, ఫిబ్రవరి 3: గత ప్రభుత్వం పదేళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ‌వచ్చిన తరువాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లతో భరోసా కల్పించిందని అన్నారు. అర్ములైన వారందరికీ ఇళ్లు కట్టిస్తామని అన్నారు. మంగళవారం హుస్నాబాద్‌ ‌పట్టణంలోని ఆరేపల్లిలో నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. హుస్నాబాద్‌ ‌పట్టణం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌ ‌గెలిస్తేనే పట్టణ అభివృద్ది సాధ్యమన్నారు. బిఆర్‌ఎస్‌ ‌బిజెపిల వ్లల ఒరిగేదే లేదన్నారు. వారికి ఓటేసినా దండగేనని అన్నారు. ఈయన వెంట సహకార సంఘం మాజీ ఛైర్మన్‌ ‌బొలిశెట్టి శివయ్య, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ ‌నాయకురాలు కర్ణకంటి మంజులారెడ్డి, కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇదిలావుంటే రాయికల్‌ ‌పట్టణ కాంగ్రెస్‌ ‌పార్టీలో మొదటి నుంచి ఉన్న తమను కాదని పార్టీ కండువా కప్పుకోని నూతన అభ్యర్థులకు బీఫారాలు ప్రకటించడంపై పలువురు కాంగ్రెస్‌ ‌నాయకులు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు తాటిపాముల మమత, యువజన కాంగ్రెస్‌ ‌పట్టణ అధ్యక్షుడు బత్తిని నాగరాజు తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేష్‌ ‌రెండవ వార్డ్ అభ్యర్థిగా ప్రకటించగా అతను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *