ఆరు గ్యారెంటీలపై నిలదీయండి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్1: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఆరు గ్యారంటీల అమలులో అనుసరిస్తున్న నిర్లక్షవైఖరిపై నిరసన తెలుపుతూ నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పార్టీ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ముందుగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లయినా ఇంతవరకు అమలు చేయకుండా మోసం చేస్తున్నదని అన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర -సర్వేలో బూత్ స్థాయి కార్యకర్తలు బీఎల్వోలతో కలిసి ఇంటింటికి వెళ్లి బోగస్ ఓటర్లను ఏరివేయడంలో సహకరించాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశమున్నందున పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *