– విజయం అందించినందుకు నవీన్ కృతజ్ఞతలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయనని జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం నవీన్ యాదవ్ శుక్రవారం యూసుఫ్‌గూడలో విలేకర్లతో మాట్లాడుతూ.. అధిక బ్జడెట్ తీసుకువచ్చి.. జూబ్లీహిల్స్‌ను మరింత అభివృద్ధి చేస్తానని నియోజకవర్గ ప్రజలకు ఆయన హా ఇచ్చారు. భారీ మెజార్టీతో తనను జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించారన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలుపించినందుకు ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. ఎంతో కష్టపడి జూబ్లీహిల్స్ కార్యకర్తలు తనను గెలిపించుకున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధే తన ఎజెండా అని పేర్కొన్నారు. అయితే గతంలో బీఆర్‌ఎస్ పార్టీ గెలిచిన సమయంలో కక్ష పూరిత రాజకీయాలు చేశారని గుర్తు చేశారు. కానీ తాను అలాంటి రాజకీయాలు చెయ్యనన్నారు. అందరితో కలుపుకొని వెళ్లి.. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. మన ప్రాంత సమస్యలు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు. తనను, తన కుటుంబం వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ వోట్లు అడిగారని.. అందుకు జూబ్లీహిల్స్ ప్రజలు గట్టిగా సమాధానం ఇచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై బీఆర్‌ఎస్ చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. రిగ్గింగ్, దౌర్జన్యం అనేవి తప్పుడు మాటలని నవీన్ యాదవ్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడంపై బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మండిపడ్డారు. అధికార కాంగ్రెస్ దౌర్జన్యాలు, రిగ్గింగ్ వల్లే ఆ పార్టీ అభ్యర్థికి ఈ విజయం సొంతమైందంటూ విమర్శించింది. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ పై విధంగా స్పందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





