– 8మంది మహిళా భక్తుల మృత్యువాత
పాట్నా, మార్చి 31: బీహార్‌లోని నలందలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నలందలో ఒక ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. నలంద జిల్లాలోని శీతలా మాత ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. అందరూ మహిళలే కావడం గమనార్హం.ఈ ఘటనలో మరో 12 మందికి పైగా గాయపడ్డారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. నలంద జిల్లాలోని బీహార్ షరీఫ్‌కు దాదాపు ఐదు కిలోటర్ల దూరంలో ఉన్న మఘ్రా గ్రామంలోని శీతలాష్టమి ఆలయం వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. చైత్ర మాసంలోని చివరి మంగళవారం కావడంతో, ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అధిక సంఖ్యలో మహిళలు మంగళవారం నాడు ఈ గుడికి వస్తుంటారు. నిర్వహణ లోపం కారణంగానే ఈ తొక్కిసలాట జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పదుల సంఖ్యలో మహిళలు స్ప•హ తప్పిపోడిపోయిన దృశ్యాలు కలవరపెడుతున్నాయి. బాగా రద్దీగా ఉండడంతో అంబులెన్స్‌లు కూడా అక్కడకు చేరుకోవడం ఇబ్బందిగా మారింది. గాయపడిన వారికి స్థానికులు సపర్యలు చేస్తున్నారు. చేతులతో ఎత్తుకుని అంబులెన్స్‌ల వద్దకు తీసుకెళ్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





