సంధ్య థియేటర్‌ ‌తొక్కిసలాట ఘటన

– ఏడాది తరవాత పోలీసుల ఛార్జ్‌షీటు
– 23మందిపై అభియోగాలు
– ఎ11గా నటుడు అల్లు అర్జున్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27:‌ సంధ్య థియేటర్‌ ‌తొక్కిసలాట కేసులో పోలీసులు ఛార్జిషీట్‌ ‌దాఖలు చేశారు. ఏడాది తరవాత ఛార్జిషీట్‌ ‌దాఖటు చేసి, మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు. ఛార్జిషీట్‌లో ఏ-11గా సినీ నటుడు అల్లు అర్జున్‌ ‌పేరు చేర్చారు. 2024 డిసెంబర్‌ 4‌న రాత్రి 9.30 గంటల సమయంలో పుష్ప-2 బెనిఫిట్‌ ‌షో కోసం హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ ‌వద్దకు వొచ్చిన చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయడంతో రేవతి(35) అనే మహిళతోపాటు ఆమె కుమారుడు శ్రీతేజ(9) కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సీపీఆర్‌ ‌చేశారు. హుటాహుటిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతిచెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్‌కు తరలించారు. పుష్ప-2 సినిమా చూసేందుకు మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు రాగా… తల్లి కుమారుడు తొక్కిసలాటలో చిక్కుకున్నారు. వారిలో తల్లి మృత్యువాతపడటం విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *