నేను దిగాల్సిన స్టేజీ వ‌చ్చింది

– చివరి రోజు బస్‌లో ప్రయాణం

– సజ్జనార్‌ ‌ఆసక్తికర ట్వీట్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌29: ‌ఆర్టీసీ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌పదవి నుంచి హైదరాబాద్‌ ‌సిటీ పోలీస్‌ ‌కమిషనర్‌గా బదిలీ కావడంపై వీసీ సజ్జనార్‌ ‌భావోద్వేగానికి లోనవుతూ తన ‘ఎక్స్’ ‌ఖాతాలో ఎమోషనల్‌ ‌పోస్ట్ ‌పెట్టారు. తన స్టాప్‌ ‌వచ్చేసిందని.. బస్సు దిగి కొత్త మార్గం వైపు అడుగులేసే సమయం వొచ్చిందని ఆయన పోస్ట్ ‌చేశారు. ప్రయాణాలు ముగుస్తుంటాయని, ప్రయాణికులు దిగిపోతుంటారని.. కానీ రోడ్డు మాత్రం ఎప్పటికీ అలానే ముందుకు సాగుతుందని సజ్జనార్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. బస్‌ ‌పార్క్ ‌చేసి.. సరికొత్త సవాల్‌ ‌వైపు దూసుకెళ్లాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. టీజీఎస్‌ఆర్టీసీకి లైఫ్‌ ‌లైన్‌ అయిన ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు సజ్జనార్‌ ‌కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సంస్థతో, ఉద్యోగులతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ అన్నారు. నాలుగేళ్ల పాటు ఎండీగా పని చేశానని.. ఈ సమయంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఆర్టీసీ ఎండీ నుంచి హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌గా బదిలీ అవుతున్న క్రమంలో.. ఆర్టీసీ అధికారులు బాగ్‌ ‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళా భవన్‌లో వీడ్కోలు సభ నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేశానని సజ్జనర్‌ అన్నారు. ఉద్యోగులపై దాడులు జరిగినప్పుడు, కఠినంగా వ్యవహరించమని పేర్కొన్నారు. సినీ నటుడు అల్లు అర్జున్‌ ‌నటించిన ఓ యాడ్‌లో ఆర్టీసీ సంస్థను ప్రతిష్టను దిగజారిన విషయంలో లీగల్‌ ‌నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నాలుగేళ్ళ సమయంలో ఆర్టీసీ సంస్థ అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించిన ఉద్యోగులకు సజ్జనర్‌ ‌ధన్యవాదాలు తెలిపారు. టీజీఎస్‌ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనార్‌ ‌ప్రజా రవాణాపై తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్‌ – ‌టెలిఫోన్‌ ‌భవన్‌ ‌బస్టాండ్‌ ‌నుంచి బస్‌భవన్‌ ‌వరకు బస్సులో ప్రయాణించారు. యూపీఐ పేమెంట్‌ ‌చేసి కండక్టర్‌ ‌వద్ద సొంత ఖర్చుతో టికెట్‌ ‌తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో ముచ్చటించారు. వీసీ సజ్జనార్‌ ‌హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌గా బదిలీపై వెళుతున్న సంగతి తెలిసిందే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *