హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది. దూరప్రాంతాల ప్రయాణికులు విమానం దిగిన వెంటనే పుష్పక్ బస్సులో సమీపంలోని ఆర్‌జీఐఏ బోర్డింగ్ పాయింట్‌కు వెళ్లి అక్కడి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో శ్రీశైలం వెళ్లొచ్చని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని, ్‌స్త్రంత్‌ీషపబం.ఱఅ వెబ్‌సైట్‌లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోచ్చని తెలిపారు. రిజర్వేషన్ సమయంలో ఆర్‌జీఐఏ క్రాస్ రోడ్ బోర్డింగ్ పాయింట్‌ను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





