హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2 ఉమ్మడి ఆంధ్రప్రదేశ శాసనసభ మాజీ స్పీకర్, దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను రాష్ట్ర డిజిపి కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఈ వేడుకలను రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా ప్రకటించిన నేపథ్యంలో పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల విభాగం అదనపు డిజిపి మహేష్ ఎం.భగవత్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో మల్టీ జోన్-1 ఐజిపి ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఏఐజీ ఎం రమణ కుమార్, డిజిపి కార్యాలయానికి చెందిన పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




