– సీఎం రేవంత్‌రెడ్డి నివాళి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రప{ం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న నాయకుడు శ్రీపాదరావు అని ఈ సందర్భంగా సీఎం అన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ స్పీకర్ వరకు అన్ని పదవులకు వన్నె తెచ్చిన నేత అని కొనియాడారు. శాసనసభ ఔనత్యాన్ని పెంపొందిస్తూ హుందాగా సభను నడిపిన తీరు శ్లాఘనీయమని ముఖ్యమంత్రి అన్నారు. దుద్దిళ్ల శ్రీపాదరావు జీవితం నేటి తరానికి ఒక గొప్ప స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, శాసన సభ్యుడు సంజయ్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





