– బస్సు లోయలో పడి 15మంది దుర్మరణం
కొలంబో సెప్టెంబర్ 5: శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 30 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు కొండపై నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతిచెందారు. 16 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం కొలంబబోకు తూర్పున 280 కిలోవిూటర్ల దూరంలో వెల్లవాయ పట్టణానికి సవిూపంలో ఈ ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోవడం వల్ల అక్కడిక్కడే 15మంది ప్రయాణికులు మృతి చెందారు. ఐదుగురు చిన్నారులుో సహా 16 మంది గాయపడ్డారు. డ్రైవర్ బస్సును అతివేగంతో నడపడంతో అదుపుతప్పి మరొక వాహనాన్ని ఢీకొనడంతో కొండపై నుండి బోల్తాపడి లోయలోకి పడిరదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. లోయలో పడిన బస్సు పూర్తిగా ధ్వంసమైనట్లు స్థానిక విూడియా వెల్లడిరచింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




