హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18 : ఓబుళాపురం మైనింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ దాఖలు చేసిన కేసులో ఐఎస్‌ఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీర్పును వాయిదా వేసింది. శ్రీలక్ష్మి డిశ్చార్జి పిటిషన్‌ను గతంలో సీబీఐ కోర్టు కొట్టివేయడంతో ఈ వివాదం చివరికి సుప్రీంకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు చేరింది. 6వ నిందితురాలైన ఉమ్మడి ఏపీలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా చేసిన శ్రీలక్ష్మి వేసిన వ్యాజ్యాంలో న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ వాదప్రతివాదనలను శుక్రవారం పూర్తి చేశారు
ఇదే కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఇతరులను సీబీఐ కోర్టు నిర్ధోషులుగా తేల్చింది. గాలి జనార్దన్‌రెడ్డి ఇతరులను దోషులుగా తేల్చి జైలు శిక్ష విధించిన విషయం విదితమే.
శ్రీలక్ష్మి కేసులో తీర్పు వాయిదా



