కాళేశ్వరం, బిసి బిల్లుపై రేపు చర్చ

– మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 30 : అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఆదివారం నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శాసనసభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం ముగిసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఆదివారం సభలో చర్చ జరుగుతుందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆదివారం సభలో పెడతాం. కాళేశ్వరంపై సభలో భారత రాష్ట్రసమితి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అన్ని అంశాలపై చర్చ చేయాలంటే నాలుగైదు రోజుల తర్వాత సభ నడుపుతాం. గణేష్‌ నిమజ్జనం, వరదల దృష్ట్యా సభను వాయిదా వేయాలని శ్రీధర్‌బాబు తెలిపారు. అయితే బీఏసీ సమావేశం నుంచి భారత రాష్ట్ర సమితి వాకౌట్‌ చేసింది. ఎరువుల కొరత, వరదలు, రైతుల సమస్యలపై చర్చ జరగాలని  డిమాండ్‌ చేశారు. స్పష్టమైన హావిూ రాకపోవడంతో బీఏసీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *