సిఎంపి ప్యాడ్‌ ఉత్పత్తిలో స్వావలంబనకు కృషి

-సెమికండక్టర్‌ పరిజ్ణానానికి ముఖద్వారం తెలంగాణ
– జపనీస్‌ కంపెనీ, టి-వర్క్స్‌ మధ్య ఎంవోయూ
-ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: జపనీస్‌ సెమీకండక్టర్‌ సాంకేతిక పరిజ్ణానానికి తెలంగాణ ముఖద్వారంగా అభివృద్ధి చెందుతోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడిరచారు. సెమీకండకర్ల తయారీలో కీలకమైన కెమికల్‌, మెకానికల్‌ పాలిషింగ్‌ (సిఎంపి) టెక్నాలజీని స్థానికంగా అందుబాటులోకి తెచ్చేందుకు జపాన్‌కు చెందిన టోహో కోకి సెయిసాకుషో సంస్థ ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్‌లో తొలిసారి సిఎంపి ప్యాడ్‌ హబ్‌ను రూ.8 కోట్లతో ఆ సంస్థ ఏర్పాటు చేస్తోందని, ఈ మేరకు టోహో కోకి సెయిసాకుషో, టి-వర్క్స్‌ మధ్య అవగాహన ఒప్పందరం (ఎంవోయూ) కుదిరిందని ఆయన తెలిపారు. ఈ రంగంలో 200-300 మంది సాంకేతిక నిపుణులను తయారు చేయడం తమ లక్ష్యమన్నారు. సిఎంపి ప్యాడ్‌ల ఉత్పత్తిలో దేశం స్వావలంబన సాధించేందుకు రాష్ట్రం పాటుపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో సిఎంపి ప్యాడ్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలు లేకపోవడం వల్ల ఏటా రూ.100 కోట్ల విలువైన దిగుమతులు చేసుకుంటున్నట్టు వెల్లడిరచారు. దేశంలోనే అతి పెద్ద ఫోటో టైపింగ్‌ కేంద్రం టి-వర్క్స్‌ను జపనీస్‌ సంస్థ భాగస్వామిగా ఎంపిక చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, పరిశోధకులు, అంకుర సంస్థలకు ఈ ప్యాడ్‌ హబ్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సిఎంపి సేవలు అవసరమైన పరిశ్రమలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని, సెమీ కండక్టర్‌ పరిశ్రమకు విడిభాగాలు అందించే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని తెలంగాణ ప్రతిష్టను పెంచాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. జపనీస్‌ పరిశ్రమలు, అంకుర సంస్థలు, పరిశోధకుల కోసం టీ-వర్క్స్‌లో ప్రత్యేకంగా ఒక సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్సును నెలకొల్పనున్నట్టు తెలిపారు. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే ఇక్కడ శిక్షణ పొందిన వారు స్థానికంగా సిఎంపి ప్యాడ్‌లను సొంతంగా తయారు చేయగలిగే పరిజ్ణానం పొందగలుగుతారన్నారు. దీని కోసం తొలుత ఒకటి లేదా రెండు చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ఎంపిక చేసి శిక్షణ అందిస్తామని శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. అవగాహన ఒప్పంద కార్యక్రమంలో టోహో కోకి సంస్థ గ్లోబల్‌ బిజినెస్‌ హెడ్‌ టకుయా నిషిమురా, టి-వర్క్స్‌ సిఇఓ జోగిందర్‌ తనికెళ్ల తదితరులు పాల్గొన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *