– జాతీయ క్రీడా ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి వాకిటి
– నేటినుంచి తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 23: పసిప్రాయం నుండే పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తి కలిగించేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం నుంచి తొమ్మిది రోజులపాటు జరిగే జాతీయ క్రీడా ఉత్సవాలను గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో
ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్ననాటి నుండే విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి కలిగించడం, వారిని మైదానాల వైపు ప్రోత్సహించడం కుటుంబాలకు మాత్రమే కాకుండా దేశానికి, సమాజానికి ఎంతో శ్రేయస్కరమని అన్నారు. పసిప్రాయం నుండే క్రీడల్లో పట్ల శిక్షణ పొందిన విద్యార్థులు క్రీడల్లో విజయాలు సాధించడమే కాక ఆరోగ్యవంతులుగా తయారవుతారని అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో దేశంలో ఏ రాష్ట్రమూ నిర్వహించనంత ఘనంగా జాతీయ క్రీడా ఉత్సవాలను నిర్వహించబోతున్నామని, జాతీయ క్రీడా దినోత్సవం అని ఒక్క రోజుకే పరిమితం చేయకుండా తొమ్మిది రోజులపాటు వివిధ వర్గాలను క్రీడల్లో భాగస్వాములను చేసే విధంగా అన్ని వయసుల, వర్గాల వారికి వినూత్న కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు. కేవలం హైదరాబాద్ నగరానికే కాకుండా జిల్లా కేంద్రాల్లో, వివిధ విద్యాసంస్థల్లో ఈ క్రీడా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి రవీందర్ అనిత, పీఆర్వో కాలేరు సురేష్, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ మధు, ఫ్యూచర్ ఒలంపియన్ నిర్వాహకులు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





