– ఆటగాళ్లతో మూడేళ్లుగా విద్యాశాఖ ఆటలు!
– క్రీడా పాలసీ అంటూ కొత్తరాగం
– అంధకారంలో 28 మంది జాతీయ క్రీడాకారుల భవితవ్యం
– అక్రమ నియామకాలపై ఎటూ తేల్చని వైనం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2: డీఎస్సీ-2024 స్పోర్ట్స్ నియామకాలపై అడిగిన ప్రతిసారి 33 మంది నియామకల్లో కొద్దిమంది అనర్హులతోపాటు ఫాం 3 & 4 తొలగించాలి కాబట్టే అలస్యం, మరో వారంలో నియమాలు పూర్తి చేస్తాస్తాం అంటూ విద్యాశాఖ అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకుంటోందని 2024 ఎస్‌జీటీ స్పోర్ట్స కోటా బాధితులు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. 28 మంది జాతీయ క్రీడాకారుల అభ్యర్థులకు 16 నెలలుగా పూటకో మాట చెప్తూ విద్యాశాఖ ఎప్పటికప్పుడు దాటవేత వైఖరిని అవలంబిస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో హైకోర్టు చివాట్లు పెట్టడంతో 2024 డీఎస్సీ స్పోర్ట్స్ నియామకాల్లో తప్పు జరిగిందని తెలుసుకున్న విద్యాశాఖ వెంటనే బాధితులకి మళ్ళీ రీవెరిఫికేషన్ పేరుతో, అక్రమ నియామకాల జోలికి మాత్రం పోకుండా వారిని కొనసాగిస్తూ జాతీయ క్రీడకారులకి మాత్రం అన్యాయం చేస్తున్నారు. అయితే 28 మంది జాతీయ క్రీడాకారులు అన్యాయం జరిగిన విషయం తెలడమే కాకుండా కనీసం స్పొర్ట్స్ సర్టిఫికేట్ లేకుండా కొందరు, అర్హత లేని రాష్ట స్థాయి క్రీడాకారులు ఉద్యోగాలు కల్పించమని క్రీడశాఖ నివేదిక ఇవ్వడంతో జరిగిన తప్పుని క్రీడాశాఖకి అంట కట్టే ప్రయత్నం చేసింది, ఆలస్యంగా మేల్కొన్న క్రీడాశాఖ ప్రభుత్వ అనుమతితో కచ్చితమైన రిప్లై ఇచ్చే సరికి, కొత్త నాటకానికి తేరే తీస్తూ వాయిదాల పర్వం మొదలెట్టింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రిన్సిపాల్ సెక్రటరీల, విద్య శాఖ డైరెక్టర్ లీవ్ లో వున్నారంటూ, ఇలా పలు రకాలైన సాకులు చూపుతూ మొత్తానికి 2024 డిఎస్‌సి స్పోర్ట్స్ కోటా నియామకాలను ఇప్పటివరకు వాయిదా వేస్తూ వస్తోంది. ఇప్పటికైనా వెరిఫికేషన్ పలితాలు ప్రకటించి అక్రమంగా నియామకాలు జరిగిన దొంగ క్రీడాకారులు తొలగించి, తమకు న్యాయం చేయాలని 28 జాతీయ క్రీడాకారాలు విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



