– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: ఇప్పుడు క్రీడలు మన జీవితంలో, దేశ కార్యకలాపాల్లో ఒక ముఖ్య భాగంగా గుర్తింపు పొందాయని బీజేపీ రాష్ట్ర అథ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో 41వ జాతీయ సీనియర్ క్యోరుగి (టేక్వాండో) ఛాంపియన్‌షిప్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించి క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించారు. మునుపు మనం బ్రాంజ్ మెడల్ కూడా గెలవలేకపోయేవాళ్లం. కానీ ఇప్పుడు మన క్రీడాకారులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌ను ఒలింపిక్స్‌లో కూడా గెలుస్తున్నారని అన్నారు. భారత ప్రభుత్వం క్రీడలపై 2014తో పోలిస్తే 130 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోందన్నారు. ’కో కుడోక్, కో ఇండియా వంటి కార్యక్రమాలు యువతలో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరిచాయని తెలిపారు. ఈ పోటీలు మీలో మరింత ప్రతిభను వెలికితీస్తాయి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ఇస్తాయి అని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివరించినట్లు ‘వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో యువత అభివృద్ధి, క్రీడల బలోపేతం కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, జాతీయ ఏకీకరణ-ఈ మూడు అంశాలను బలపరిచే శక్తిగా క్రీడలను మరింత మెరుగుపరచే దిశగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కీలక చర్యలు తీసుకుంటోందని, దేశ నిర్మాణంలో క్రీడలు ఒక శక్తివంతమైన మార్గదర్శక శక్తిగా నిలవాలనే సంకల్పం ఈ కార్యక్రమాల ద్వారా స్పష్టంగా కనిపిస్తోదని రామచందర్‌రావు అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


