– ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్‌లో సోమవారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం క్రీడల ద్వారానే సాధ్యమవుతుందని, ఆరోగ్యం క్రీడాకారుల విజయానికి ముఖ్యమైన అంశం కాబట్టి కోచ్‌లు క్రీడాకారులకు క్రమబద్ధంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, జిల్లా కేంద్రాలలో క్రీడా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.సోనీ బాలాదేవి మాట్లాడుతూ యశోద హాస్పిటల్, ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఈ క్యాంప్ నిర్వహించామని పేర్కొన్నారు.
విశేష స్పందన
24 రకాల ఆరోగ్య పరీక్షలతో నిర్వహించిన ఈ హెల్త్ క్యాంప్‌లో 780మంది పరీక్షలు చేయించుకున్నారు. స్పోర్ట్స్ అథారిటీ కోచ్‌లు, సిబ్బంది, ట్రైనీలు, వారి కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకున్నారు. అధునాతన పరికరాలతో ఉచిత పరీక్షలు జరపడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని స్పోర్ట్స్ అథారిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవితేజ సమన్వయం చేశారు. డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, సుజాత, అనిత, ఇంజనీర్ అశోక్ కుమార్, పీఆర్వో కాలేరు సురేష్, యశోద హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జీవన్, ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ వైద్య బృందం పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





