శాసనసభ్యులకు క్రీడా పోటీలు

– 28 29 తేదీల్లో రెండ్రోజుల పాటు నిర్వహణ
– మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి వెల్లడి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 26: రాష్ట్రంలో విద్యార్థులు యువకులు అన్ని వర్గాలకు క్రీడల ప్రాముఖ్యత తెలియజేసే విధంగా శాసన సభ్యుల క్రీడోత్సవాలు  నిర్వహించబోతున్నామని రాష్ట్ర మంత్రులు జూపల్లి క ష్ణారావు, వాకిటి శ్రీహరి లు తెలిపారు. ఈనెల 28 29 తేదీల్లో జరగబోయే శాసనసభ్యులు శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు మొదటి ఎడిషన్ లెజిస్టేటర్ స్పోర్ట్స్ విÖట్ 2026  నిర్వహణ సన్నాహక సమావేశం అసెంబ్లీలోని కమిటీ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనునిత్యం రాజకీయాల్లో బిజీ ఉండే శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు ఈ క్రీడా పోటీలు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా రాష్ట్ర ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని క్రీడల పట్ల అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నామని వారు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పోటీలు మొట్టమొదటి సారిగా నిర్వహించబోతున్నామని, పార్టీల బేధభావాలు పక్కనపెట్టి శాసనసభ్యులు అందరూ ఈ క్రీడల్లో పాల్గొన్న పోతున్నారని వారు తెలిపారు. రాష్ట్రంలో అన్ని  వర్గాల వారికి వయసుల వారికి క్రీడల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.ఇందుకోసం శాసనసభ సచివాలయం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మరియు రాష్ట్ర సాంస్క తిక శాఖ తోపాటు వివిధ శాఖల సమన్వయంతో  శాసనసభ్యులకు వివిధ క్రీడాంశాల్లో పోటీలు మరియు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో  శాసనమండలి విప్ అద్దంకి దయాకర్ శాసనసభ్యులు ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ యశస్విని రెడ్డి , పాల్వాయి హరీష్ రావు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ రావు భాను ప్రసాద్ రావు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి,  స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి శాసనమండలి కార్యదర్శి నరసింహచార్యులు శాసనసభ కార్యదర్శి ఆర్ తిరుపతి వివిధ క్రీడా వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి ఎడిషన్ లెజిస్టేటర్ స్పోర్ట్స్ ఈవెంట్ 2026 ప్రారంభ వేడుకలు ఎల్బీ స్టేడియంలో 28వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితోపాటు ఉభయ సభల వివిధ పక్ష నేతలు విప్ లు, అన్ని పార్టీల శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

కాగా,శాసనసభ్యుల క్రీడోత్సవాల పోస్టర్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, శాసనసభ్యులు రాజ్ ఠాకూర్,  అనిరుద్ రెడ్డి, రామచంద్రనాయక్,  స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోని బాల దేవి పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *