హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: డా. బి. ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న “సామాజిక సాధికారత వారోత్సవాల” లో భాగంగా డా.బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా “సాంస్కృతిక, క్రీడా సమ్మేళనాన్ని” విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో నిత్యం బిజీగా ఉండే ఉద్యోగులు క్రీడల్లో పాల్గొంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలనీ తద్వారా పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా మానసిక, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. వారం రోజుల పాటు ఉద్యోగులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు బోధనేతర ఉద్యోగుల సంఘ అధ్యక్షులు కాంతం ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొ.ఐ. ఆనంద్ పవార్; ప్రొ. వెంకట రమణ; 4. బానోత్ ధర్మ; ప్రొ. కె. కృష్ణా రెడ్డి; డా.వై.వెంకటేశ్వర్లు; ప్రొ. బి. శ్రీనివాస్; బోధనేతర ఉద్యోగుల సంఘ సభ్యులు కాంతం ప్రేమ్ కుమార్, మియా జనీ, పి. విశ్వనాథ్, వై. అశోక్, కె. పాండు, భరత్ రెడ్డి, డాక్టర్ యాకేశ్ దైదా, అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు, ఆయా విభాగాధిపతులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





