క్రీడలను అభిమానించే  తెలంగాణ

–  ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ సీజన్-4కు ప్రభుత్వ మద్దతు
– ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : క్రీడలను అమితమైన అభిరుచితో స్వీకరించే రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 4వ సీజన్ కోసం హైదరాబాద్‌కు ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ను స్వాగతించడం హర్షణీయమ‌న్నారు. అక్టోబర్ 2 ప్రైమ్ వాలీబాల్ లీగ్ యొక్క నాల్గవ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మద్దతుతో హైదరాబాద్ ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తుంది. గురువారం రాష్ట్ర క్రీడలు, యువజన సేవల మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్(యాట్, సి) స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఐఏఎస్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్, ఎండీ శివ చరణ్ రెడ్డి, ఎ.సోనిబాలా దేవి ఐఎఫ్ఎస్, లీగ్ సీజన్ 4ని నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతును ప్రకటిస్తూ పీవీఎల్ సీజన్-4 పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఆవిష్కరించారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *