ఓయూలో విద్యార్థులకు పాడైన అన్నం

– విద్యార్థుల అందోళన కనువిప్పు కావాలి
– సీఎం రేవంత్‌పై హరీష్‌ రావు విమర్శలు

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 3 : రేవంత్‌ పాలన తీరును సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు తప్పుబట్టారు. ఓయూ లా కాలేజీ మెస్‌లో పాడైపోయిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడం కాంగ్రెస్‌ పాలనలో విద్యావ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోందని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వేయి కోట్లు ఇస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి విద్యార్థులకు కనీసం ఒక్క పూట అయినా మంచి భోజనం పెట్టలేకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం, గురుకులాల్లో పురుగుల అన్నం, ఇప్పుడు యూనివర్సిటీల్లో పాడైపోయిన భోజనం.. ఇదేనా కాంగ్రెస్‌ రెండేళ్ల పాలనలో సాధించిన ఘనత అని నిలదీశారు. యూనివర్సిటీ పర్యవేక్షణలో ప్రభుత్వ నిర్లక్ష్యం అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విద్యా శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రేవంత్‌ రెడ్డి గారూ.. విూ చేతగానితనంతో విద్యార్థుల భవిష్యత్తును, ఆరోగ్యాన్ని ఆగం చేయకండి అని హరీశ్‌రావు హితవుపలికారు. ఇప్పటికైనా ప్రగల్భాలు మాని విద్యార్థులకు కడుపునిండా మంచి భోజనం పెట్టండని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *