కారు ఢీ : వైద్య విద్యార్థిని దుర్మణం

– హయత్‌నగర్‌ ‌పీఎస్‌ ‌పరిధిలో సంఘ‌ట‌న‌

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: ‌నగరంలోని హయత్‌నగర్‌ ‌పీఎస్‌ ‌పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఎంబీబీఎస్‌ ‌విద్యార్థిని ఐశ్వర్య మృతిచెందారు. ఆర్టీసీ కాలనీ వద్ద తన తండ్రి పాండుతో కలిసి రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. తీవ్రవ్రంగా గాయ‌ప‌డిన‌ యాంసాని ఐశ్వర్య, పాండులను ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే ఐశ్వర్య మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం పాండును వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఐశ్వర్య మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *