– జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1 : ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలనీ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యసాధనకు బిఎల్ఓ సూపర్వైజర్లు, సూపర్వైజర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. అప్పగించిన విధులను సిబ్బంది సమర్థవంతంగా నిర్వర్తించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా చేపట్టిన ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిపై బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ అర్బన్, రూరల్, కొత్తపెల్లి మండలాల తహసిల్దారులు, డిప్యూటీ తహసిల్దార్లు, బిఎల్ఓ సూపర్వైజర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఓటర్ మ్యాపింగ్ ఎలా సాగుతోంది.. ఎంత శాతం పూర్తయింది అని కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టెందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. బిఎల్ఓ సూపర్వైజర్లు సూపర్వైజర్లుఆశ వర్కర్లు అంగన్వాడి సిబ్బంది వైద్య సిబ్బంది విస్తృతంగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో పాల్గొనాలని ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియపై ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని, వారం రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. పకడ్బందీగా వ్యవహరిస్తూ ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజు ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై రిపోర్టు అందించాలనీ, వారం తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డివో కె..మహేశ్వర్, పలువురు అధికారులుపాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





