మేడారం జాతర పనులలో వేగం పెంచాలి

– శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపడుతన్నాం
– గద్దెల వద్ద విస్తృత ఏర్పాట్లు : మంత్రి పొంగులేటి

మేడారం/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సమ్మక్క- సారలమ్మ జాతర జనవరి నెలలో జరగనున్న నేపథ్యంలో శాశ్వత ప్రాతిపదికన విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.ఎస్‌.శ్రీనివాసరాజులతో కలిసి శుక్రవారం ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, ఆలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్‌ పనులను, రాతి స్తంభాల స్థాపన పనులను, జంపన్న వాగు వద్ద పనులను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. తొలుత సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పూజుల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనల మేరకు మరో వందేళ్ల వరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసే విధంగా చేపట్టిన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జాతరకు గిరిజనులు, గిరిజనేతరులు దాదాపు కోటిమందికి హాజరవుతారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, మేడారం ప్రాంగణాన్ని మహా అద్బతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. జాతర కోసం 50 కి.మీ పరిధిలో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ భానోత్‌ రవిచందర్‌ , ములుగు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కల్యాణి, పూజారులు, ఆర్‌అండ్‌బి, ఇంజనీరింగ్‌ అధికారులు, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *