స్పీచ్‌ పాథాలజిస్ట్‌ పోస్టులకు ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టు

– విడుదల చేసిన మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: ఉద్యోగాల భర్తీలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు స్పీడ్‌ పెంచింది. ఇటీవలే 1284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన బోర్డు తాజాగా స్పీచ్‌ పాథాలజిస్ట్‌ పోస్టుల ఫస్ట్‌ ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టును విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరి వివరాలను వెబ్‌సైట్‌లో మంగళవారం అప్‌లోడ్‌ చేసింది. అభ్యర్థి అకడమిక్‌ క్వాలిఫికేషన్‌లో సాధించిన మార్కులు, వెయిటేజీ ద్వారా సాధించిన మార్కులు, వారి స్థానికతకు సంబంధించిన అంశాలు సహా అన్ని వివరాలను వెబ్‌సైట్‌లో (http://mhsrb.telangana.gov.in/) అందుబాటులో ఉంచామని, వీటిపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని బోర్డు కోరింది. అభ్యంతరాలను జనవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల నమోదు చేయాలని సూచించింది. అభ్యంతరాలను అభ్యర్థి లాగిన్‌ ద్వారా మాత్రమే నమోదు చేయాలని తెలిపింది. ఆఫ్‌లైన్‌లో పంపించిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని, మల్టీ జోన్‌-1 పరిధిలో ఎలాంటి పోస్టులు నోటిఫై చేయనందున ఆ జోన్‌కు చెందిన అభ్యర్థులను పోస్టుల కోసం పరిగణనలోకి తీసుకోవడం లేదని బోర్డు స్పష్టం చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *