ఫ్యూచర్ సిటీలో జీసీసీల కోసం ప్రత్యేక జోన్

– సీఎం రేవంత్ ప్రతిపాదన
– గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిగ్యూటివ్‌లతో భేటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: జీవ విజ్ఞాన రంగానికి సంబంధించి హైదరాబాద్‌లో పెట్టుబడులు, కంపెనీలు పెట్టాలని యోచించే గ్లోబల్ ఇన్వెస్టర్లకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికే ఎన్నో లైఫ్ సైన్సెస్ కంపెనీలు హైదరాబాద్‌లో జీసీసీ(గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్)లను ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. ఈ విషయమై మరింత లోతుగా దృష్టి సారించడానికి, గ్లోబల్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఇన్నోవేషన్ సెంటర్‌లను సులభతరం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఫ్యూచర్ సిటీలో జీసీసీ¾ల కోసం ఒక ప్రత్యేక జోన్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. నగరంలో బయో ఏషియా సదస్సు-2026 జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, టీజీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చెర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్‌లు లైఫ్ సైన్సెస్ రంగంలో గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిగ్యూటివ్‌లతో భేటీ అయ్యారు.

ప్రకటించిన పెట్టుబడుల వివరాలు

ఫ్రాన్స్‌లో తన ప్రపంచ ప్రధాన కార్యాలయంతో సనోఫీ నుండి విడిపోయిన గ్లోబల్ కన్స్యూమర్ హెల్త్‌కేర్ కంపెనీ ఒపెల్లా హెల్త్‌కేర్, దాని జీసీసీ¾ కార్యకలాపాలను 42,000 చదరపు అడుగుల సౌకర్యంతో విస్తరిస్తోంది. వచ్చే ఏడాదిలోపు 500 ఉద్యోగాలను ఈ కంపెనీలను సృష్టించనుంది. జీఏపీఎఫఏ ఇండోనేషియా విభాగమైన వాక్సిండో యానిమల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక బీఎసఎల్-3 వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం కోళ్లు, పశువులు, స్వైన్. ఆక్వాకల్చర్ కోసం వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెడుతుంది ఏఐ, డేటా సైన్స్ కంపెనీగా పేరొందిన ట్రెడెన్స్ ఐఎన్సీ, ఏఐ-ఆధారిత హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ పై కీలక సేవలు అందించిన సంస్థ తన హైదరాబాద్ కార్యకలాపాలను నిర్వహించాలని ప్రకటించింది. ఈ కేంద్రం సుమారు 18వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా దీనిలో ప్రపంచస్థాయి కార్యకలాపాలను నిర్వహించతలపెడుతున్నది. దీంతో ఏఐ ఆధారిత హెల్త్ కేర్ రంగంలో మరింత అత్యాధునికత రానుంది. భారత దేశ లైఫ్ సైన్సెస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో భారీస్థాయిలో ఫార్మాట్ లైఫ్ సైన్సెస్ క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 12 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న మిలియన్ చదరపు అడుగుల అడ్వాస్డ్ ల్యాబ్, మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. ఇది రాబోయే ఆరు సంవత్సరాలలో మరింత విస్తృతం కానున్నదని సమావేశంలో చర్చకు వచ్చింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *