హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7: అయ్యప్ప భక్తుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. శుక్రవారం నుంచి (నవంబర్ 7) జనవరి వరకు 60 ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి శబరిమల సమీప స్టేషన్ల వరకు నడుపుతుంది. శుక్రవారం నుంచి ఈ రైళ్లకు సంబంధించిన టికెట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. చర్లపల్లి నుంచి కొల్లాం (రైలు నంబర్ 07107)- నవంబర్ 17, 24 తేదీల్లో, డిసెంబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో, జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి బయల్దేరుతాయి. ఇవి మరుసటి రోజు కొల్లాం చేరుకుంటాయి. మొత్తం 10 రైళ్లను అందుబాటులో ఉంచారు. ఇవి పగిడిపల్లి, గుంటూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతాయి. కొల్లాం నుంచి చర్లపల్లి (రైలు నంబర్ 07108)- నవంబర్ 19, 26 తేదీల్లో, డిసెంబర్ 3, 10, 17, 24, 31 తేదీల్లో, జనవరి 7, 14, 21 తేదీల్లో కొల్లా నుంచి బయల్దేరుతాయి. మరుసటి రోజు చర్లపల్లి చేరుకుంటాయి. ఈ రైళ్లు రేణిగుంట, గూడూరు, గుంటూరు, పగిడిపల్లి మీదుగా వస్తాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





