– హైదరాబాద్ – విజయవాడ మధ్య మరో పది స్పెషల్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10: సంక్రాంతి రద్దీ దృష్ట్యా హైదరాబాద్`విజయవాడ మధ్య మరో పది స్పెషల్ ట్రైన్స్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చైౖర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. చైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రిజర్వేషన్ చేసుకోని వారి కోసం రైలులో సగానికిపైగా జనరల్ బోగీల ఏర్పాటు చేయడం విశేషం. పండగకు ముందు, తర్వాతి రోజుల్లో ఈ రైళ్లు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి. ఈనెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు, ఈనెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి ఈ రైళ్లు నడుస్తాయి. సంక్రాంతి పండగ సందర్భంగా ఇప్పటికే నడుస్తున్న 150కిపైగా అదనపు రైళ్లకు ఇవి అదనం. అయితే ఈ పది ప్రత్యేక రైళ్లు కేవలం విజయవాడ వరకే నడుస్తాయి. ఇప్పటికే నడుస్తున్న సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ మాత్రం నర్సాపురం, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మచిలీపట్నం, నాందేడ్ వరకు నడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్ల నిర్వహణ విషయంలోనూ దక్షిణ మధ్య రైల్వే శాఖ జాగ్రత్తలు తీసుకుంది. చాలా రైళ్లను చర్లపల్లి నుంచి బయల్దేరేలా షెడ్యూల్ చేసింది. దీంతో పునర్నిర్మాణంలో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై భారం పడకుండా జాగ్రత్త పడిరది. ఒక్క చర్లపల్లి నుంచే కాక కొన్ని రైళ్లు బేగంపేట్, హైటెక్ సిటీ, లింగంపల్లి నుంచి బయల్దేరేలా ప్లాన్ చేసింది. ఇదిలా ఉంటే, సంక్రాంతి పండగను ఆనందంగా తమ సొంత ఊర్లలో జరుపుకునేందుకు నగరవాసులు భారీ సంఖ్యలో ప్లలెలకు క్యూకడుతున్నారు. దీంతో టోల్ ప్లాజాలు, విజయవాడ వైపు వెళ్లే రోడ్లు ట్రాఫిక్‌తో కిటకిటలాడుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



