దేశ అత్యున్నత న్యాయస్థానం తమ పౌరులను తామే చంపుకోవడం సరికాదని ప్రభుత్వాలకు స్పష్టంగా చెప్పింది. ఎన్కౌంటర్లు జరిగితే పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేసి విచారించి నిజా నిజాలు తెల్చాలని స్పష్టంగా వివరించింది. ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ముహూర్తం నిర్ణయించి అంతం చేస్తామని, భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసి అధికారంలో ఉన్న పాలకులు బహిరంగంగా ప్రకటించడం పెనువిశాదం. . ఇటీవల గుండెకోట్ లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవ్ రావ్ తో సహా 28మందిని చుట్టుముట్టి చంపినట్టు బహిరంగంగానే ప్రకటించారు.
ఈ ఘటనలో పారా మిలటరీ బలగాలు, సరిహద్దు భద్రతా దళాలు, కోబ్రాలు,ఇతర పోలీసులు, డి. ఆర్. జి.బలగాలు 20వేల మందికి పైగా పాల్గొని, కేవలం పదుల సంఖ్యలో ఉన్న వారిని దిగ్భంధనం చేసి మారణ కాండ సృష్టించారు. మనుషులను చంపి పండుగ చేసుకున్నట్టు మృతదేహాల ముందు వికృత నృత్యాలు కూడా చేశారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించమని కోర్టు చేసిన సూచనను పెడచెవిన పెట్టారు కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే కాల్చి, బూడిద చేసామని ప్రకటించారు. బూడిద నైనా ఇవ్వాలని, హిందూ సాంప్రదాయం ప్రకారం ఖర్మకాండ చేసుకుంటాం అని కుటుంబ సభ్యులు వేడుకున్నా పట్టించుకోలేదు. ఖర్మకాండ సమయంలో బయటి వారు ( బంధువులు, మిత్రులు, ఆప్తులు) ఎవరూ పాల్గొనకుండా తీవ్ర ఆంక్షలు విధించారు.
ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా ఒకే విధానంతో ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్న సందర్భం ఇది. ప్రభుత్వాలన్నీ ఒక్కటిగా మధ్యభారతంలోని అత్యంత ఖరీదైన ఖనిజ సంపదను సామ్రాజ్యవాదులకు, కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారు. అతి పురాతన అడవులన్నీ బుల్డోజర్ల తో ధ్వంసం చేస్తూ పర్యావరణ విధ్వంసానికి బాటలు వేస్తున్నారు. వేల సంవత్సరాలు ఇక్కడే జీవనం కొనసాగిస్తున్న ఆదివాసులు, మూలవాసులను నిర్వాసితులను చేస్తున్నారు. ఇలాంటి విపత్కరకాలంలో పీడిత వర్గాలన్నీ ఐక్యంగా ఉండి పాలకుల దుర్నీతిని ప్రశ్నించాల్సిన, ప్రతిఘటించాల్సిన సమయమిది. బాధిత కుటుంబాలను ఓదార్చి అండగా నిలవాల్సిన కాలమిది. ఈ విషయాలను గుర్తెరిగి నడుచుకోవడం మనందరి బాధ్యత/ కర్తవ్యం.
మనం గమనించాల్సిన విషయం ఏమంటే ఈ రెండిటికి అంటే సాయుధ పోరాట కాలంలో కమ్యూనిస్టు పార్టీకి, నక్సలైట్ పార్టీలకు ప్రారంభంలో నాయకత్వం వహించింది, నడిపింది, త్యాగాలకు వెనకడుగు వేయక కదిలింది, కదిలించింది అగ్రవర్ణాలే కావడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. ప్రధానంగా నాయకత్వం వహించి నడిపింది రెడ్డి,వెలమ, బ్రాహ్మణ… కులాలవారే అన్నది మరువరాదు. ఈ నాయకత్వం డీ క్లాసిఫై అయి సబ్బండ వర్గాలతో, దళితులతో, ఆదివాసులతో, అన్ని వర్గాలతో జట్టు కట్టి ఉద్యమాలకు ఊపిరిలూదారు. కుల రహిత, వర్గ రహిత సమాజం కోసం కృషి చేశారు. దున్నేవారికి భూమి నినాదంతో భూస్వాములకు, పెత్తందారులకు వారికండగా నిలిచిన ప్రభుత్వాలకు వెన్నులో వణుకు పుట్టించారు. దేశ సంపద పై హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుందని ఎలుగెత్తి చాటారు.
తెలంగాణ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ, ఆ తర్వాత నక్సల్ బరీ వెలుగులో మొదలైన అత్యంత ప్రభావితమైన సాయుధ విప్లవానికి నాయకత్వం వహించింది మార్క్సిస్టు, లెనినిస్ట్ పార్టీలే. దీనిలో మొదటిది స్పాంటేనియస్ గా బద్దలై మౌలికమైన భూమి సమస్యను ఎజెండా మీదకు తెచ్చింది. కొనసాగింపుగా నక్సల్బరీ లో ప్రారంభమై దేశంలో విముక్తి ఉద్యమాలకు వేగుచుక్కగా మారిన పోరాటం, సిద్ధాంత బలంతో ముందుకు సాగింది. తెలంగాణ నుండి నక్సల్ బరీకి అక్కడి నుండి శ్రీకాకుళానికి, అదే క్రమంలో జగిత్యాల సిరిసిల్లాలకు చేరింది. అది తెలంగాణకు పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించి బలమైన శక్తిగా ఎదిగింది. దేశంలో రాజకీయ పార్టీలన్నీ ఒకే ఎజెండాతో ఉండగా ప్రజల పక్షాన ( ప్రధానంగా దళిత, బహుజన,ఆదివాసి వర్గాలు) పోరాటం చేస్తూ బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది పీపుల్స్ వార్/ మావోయిస్టు పార్టీ. ప్రపంచ సామ్రాజ్యవాదులకు, కార్పొరేట్ శక్తులకు కంటగింపుగా, ఆటంకంగా మారింది. పీడిత ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు కొండంత అండగా నిలిచింది మావోయిస్టు పార్టీ.
మనం గమనించాల్సిన విషయం ఏమంటే ఈ రెండిటికి అంటే సాయుధ పోరాట కాలంలో కమ్యూనిస్టు పార్టీకి, నక్సలైట్ పార్టీలకు ప్రారంభంలో నాయకత్వం వహించింది, నడిపింది, త్యాగాలకు వెనకడుగు వేయక కదిలింది, కదిలించింది అగ్రవర్ణాలే కావడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. ప్రధానంగా నాయకత్వం వహించి నడిపింది రెడ్డి,వెలమ, బ్రాహ్మణ… కులాలవారే అన్నది మరువరాదు. ఈ నాయకత్వం డీ క్లాసిఫై అయి సబ్బండ వర్గాలతో, దళితులతో, ఆదివాసులతో, అన్ని వర్గాలతో జట్టు కట్టి ఉద్యమాలకు ఊపిరిలూదారు. కుల రహిత, వర్గ రహిత సమాజం కోసం కృషి చేశారు. దున్నేవారికి భూమి నినాదంతో భూస్వాములకు, పెత్తందారులకు వారికండగా నిలిచిన ప్రభుత్వాలకు వెన్నులో వణుకు పుట్టించారు. దేశ సంపద పై హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుందని ఎలుగెత్తి చాటారు. త్యాగాల అనివార్యతకు ఆదర్శంగా నిలిచారు. విప్లవ ఉద్యమంలో సమానత్వం సమభావన అంతర్భాగమని గ్రహింపజేశారు. మతరహిత, కులరహిత సమాజంతో పాటు స్త్రీ పురుష సమానత్వ అనివార్యతను విషదీకరించారు. పీడిత వర్గాలన్నీ ఒక్కటై సమాజ స్థాపనకు నడుం కట్టడం అనివార్యమని తేల్చి చెప్పారు. ఈ చారిత్రక పరిణామ క్రమాన్ని పరిశీలించకుండా / అర్థం చేసుకోకుండా చేసే చర్చ ఆశాస్త్రీయమైనదని గ్రహించాలి.
. వ్యక్తిగత స్వార్థం, సమాజానికి నష్టం కలిగించే శక్తులను ఉదారవాదం ప్రోత్సహిస్తుంది. ఉదారవాదానికి వ్యతిరేకంగా సోషలిజం, కమ్యూనిజం పోరాడవలసిందే. ప్రజలు స్వేచ్ఛగా తమ హక్కులను అనుభవించాల్సిన చోట, ప్రభుత్వాలను వాటి రక్షణకు ప్రాధేయ పడవలసిన పరిస్థితులు ఏర్పడడంలో ఉన్న దుర్మార్గం తేటతెల్ల మయ్యింది. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న విషయాల పట్ల లోతైన అవగాహనను ఎంచుకోవాలి. రాజకీయ తాత్విక చింతనను అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే ప్రజా ఉద్యమాలకు తీవ్ర నష్టం వాటిల్లకుండా కాపాడుకోగలం.





