
దేశం నిర్లిప్తంగా ఉన్నదా, నిస్సహాయంగా ఉన్నదా, కేవలం నిశ్శబ్దంగా మాత్రమే ఉన్నదా? అందులో అంగీకారం కూడా ఉన్నదా?
విడత విడతకూ ఇరవైలు ముప్పైలు చొప్పున కాల్చివేతలు జరుగుతూ, మృతుల సంఖ్య వందలలోకి పెరిగిపోతూ, మధ్యభారతంలో ఒక ఏకపక్ష యుద్ధం కనిపిస్తుండగా, ఎందుకు ఏ అలజడీ లేదు? అలికిడీ కూడా అంతంత మాత్రమే ఎందుకు? ఇవే అంకెలు వేరే సందర్భాలలో కనిపిస్తే గగ్గోలు పెట్టే, రాజకీయులందరూ ఎందుకు పెదవులు బిగపట్టుకుని కూర్చున్నారు? ఇదంతా సహజమనా? అన్యాయమో అవాంఛనీయమో అయినా అనివార్యమనా? అందరి ప్రయోజనాలూ నెరవేరుతున్నాయనా? గొంతు విప్పితే అదే గాటన కట్టేస్తారనా?
దేశమంతా ఆగ్రహంతో ఊగిపోతున్నా, శత్రుదేశంతో కాల్పుల విరమణ సాధ్యమైంది. కానీ, ఈ తిరుగుబాటుదారులతో, విప్లవకారులతో మాటామంతీ కంటె మరణాలను కురిపించడమే ఏలికలకు ఇష్టమైంది. వార్తలన్నీ మన మనసుల్ని మెదడునీ హూనం చేసేవే, కలవరపరచి అలుపు తెచ్చేవే. వాటంతట అవి వార్తలు నిస్త్రాణ కలిగించవు. శ్మశానాలను మోసుకుతిరిగే వార్తలతోనే ఈ ‘న్యూస్ ఫేటిగ్’. ఈ చావులెక్కలకు గణకుడే లేడు. శ్రమ తెలియకుండా, జాతీయచానెళ్ల తెరల మీద యుద్ధవిన్యాసాలతోనూ, ఇంటింటినీ ఆటమైదానం చేసిన ఐపీఎల్ ఆనందోద్రేకాలతోనూ జనం అలసిపోతున్నారు, చర్మపు లోతులను కొలిచే విపణివీధి వినోదాన్ని వదిలి, ఛిద్రమైన, పేలిపోయిన, కళ్లు తెరచిన, పళ్లు గిట్టకరచిన శరీరాలను ఎవరు పరీక్షగా చూడగలరు? అభివృద్ధి యుద్ధంలో అవరోధాలను చదునుచేయాల్సిందే కదా. కొలాటరల్ కోసం కాకిగోల ఎందుకు?
విముక్త భారతం. అసమానత, అణచివేత, అత్యాచారం, దారిద్ర్యం, దోపిడీ, వేటి నుంచీ భారత్ కు విముక్తి లేదు. ఒక్క తిరుగుబాటు నుంచి మాత్రమే విముక్తి కావాలి. ప్రస్తుతానికి దాన్ని మంజూరు చేయడమైనది. ఈ ఘట్టం ముగిసిపోయాక, రేపెప్పుడో, ఈ నాటి నరమేధాలను తలచుకుని రేపటి మనుషులు గుక్కపెట్టి ఏడుస్తారు. వెన్నెముకలు లేని, తప్పొప్పులు తెలియని, వెగటు వెకిలి తరాలు అవతరించాక, అప్పుడు, తప్పో ఒప్పో ఒక స్వప్నాన్ని సాధన చేసినవారి గురించి కథలు కథలుగా చదువుకుంటారు. లక్షలాది చెట్లు కూలిన అటవీగర్భంలో నిద్రించే వందలాది ఆదివాసీ కళేబరాలు, మృత్యు బేహారులను పీడకలల్లో పలకరిస్తుంటాయి. భారతీయాత్మ ఒకానొకనాడు, నైతిక సంక్షోభంలో, బాధగా మూలుగుతుంది.
బెంగాల్ లో రగిలిన నక్సలైట్ నిప్పురవ్వ తరువాతి మజిలీ శ్రీకాకుళం. అన్ని చోట్లా పూర్వ కమ్యూనిస్టు ఉద్యమాల కొనసాగింపుగానే విప్లవ కమ్యూనిస్టులు రూపొందారు. శ్రీకాకుళం కూడా ఆదివాసీ ఉద్యమమే. విప్లవకార్యకర్తలు ప్రధానంగా ఆదివాసేతరులే. అరవైల చివర్లోని ఉద్యమావేశాలు ఎక్కడెక్కడి విద్యావంతులను, ఆశయశీలురను శ్రీకాకుళం తరలించాయి. నక్సల్బరీ లాగే శ్రీకాకుళమూ అణచివేతలో ముగిసిపోయింది. కానీ, తెలుగునాట అగ్గి చల్లారలేదు. ఆలోచన చేర్చుకుని పునర్జన్మ ఎత్తింది. ఉత్తర తెలంగాణ, గోదావరి పరీవాహక ప్రాంతాలు కొత్త ఉద్యమప్రాంతాలయ్యాయి. ఆ విస్తరణ రాయలసీమ, కోస్తాంధ్ర మీదుగా తిరిగి తూర్పుకనుమలను తాకింది. 80, 90లు ఉమ్మడి తెలుగురాష్ట్రాన్నంతా చుట్టేసింది. ఇది ఏడెనిమిది దశాబ్దాల కిందట తెలంగాణలో మొదలయిన ప్రయాణం.
యుద్ధభూమీ, కిల్లింగ్ ఫీల్డూ అయిన బస్తర్ ను వదిలేస్తే, ప్రేక్షకమాత్రమైన తక్కిన దేశాన్ని కూడా పక్కన పెడితే, లుంగలు చుట్టుకుపోయే నెప్పిని అణచిపెట్టుకున్న తెలుగు సమాజాలను ఇప్పుడు తడిమిచూడాలి. బెంగాల్ లో రగిలిన నక్సలైట్ నిప్పురవ్వ తరువాతి మజిలీ శ్రీకాకుళం. అన్ని చోట్లా పూర్వ కమ్యూనిస్టు ఉద్యమాల కొనసాగింపుగానే విప్లవ కమ్యూనిస్టులు రూపొందారు. శ్రీకాకుళం కూడా ఆదివాసీ ఉద్యమమే. విప్లవకార్యకర్తలు ప్రధానంగా ఆదివాసేతరులే. అరవైల చివర్లోని ఉద్యమావేశాలు ఎక్కడెక్కడి విద్యావంతులను, ఆశయశీలురను శ్రీకాకుళం తరలించాయి. నక్సల్బరీ లాగే శ్రీకాకుళమూ అణచివేతలో ముగిసిపోయింది. కానీ, తెలుగునాట అగ్గి చల్లారలేదు. ఆలోచన చేర్చుకుని పునర్జన్మ ఎత్తింది. ఉత్తర తెలంగాణ, గోదావరి పరీవాహక ప్రాంతాలు కొత్త ఉద్యమప్రాంతాలయ్యాయి. ఆ విస్తరణ రాయలసీమ, కోస్తాంధ్ర మీదుగా తిరిగి తూర్పుకనుమలను తాకింది. 80, 90లు ఉమ్మడి తెలుగురాష్ట్రాన్నంతా చుట్టేసింది. ఇది ఏడెనిమిది దశాబ్దాల కిందట తెలంగాణలో మొదలయిన ప్రయాణం.
తెలంగాణ సాయుధ పోరాటం ఏమి సాధించింది? శ్రీకాకుళం, ఉత్తరతెలంగాణ, నల్లమల, దండకారణ్యం ఏమి సాధించాయి? కొండను ఢీకొనడానికి చిట్టెలుకల వలె ప్రయాణించి, ఉద్దరించినదేమిటి? గుట్టలుగుట్టల మృతదేహాలు, హింసాధ్వంసరచనలు మాత్రమేనా? ఉద్యమాల ఫలితాలను భౌతికంగా, వృద్ధిరేటులోను, నిట్టనిలువు మేడల్లోనూ చూపలేము. తెలుగువారి చైతన్యంలో ఇంకిపోయిన సంస్కారం, సమాజంలో మొలకెత్తిన ప్రజాస్వామికత, కోరలు అరిగిన భూస్వామ్యం, తలెత్తి నిలిచిన అట్టడుగుల ఆత్మస్థైర్యం, వెల్లివిరిసిన సృజనాత్మకత.. ఇవన్నీ అగ్ని సరస్సున వికసించిన వజ్రాలే! తెలుగు సమాజాలలో అనేక సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిణామాలను, వికాసాలను సాధ్యం చేసింది కమ్యూనిస్టు ఉద్యమమే! దుస్సాహసాలు చేసి ఉండవచ్చు, భ్రాతృహత్యలకు పాల్పడి ఉండవచ్చు, సమర్థన దుర్లభమైన తప్పటడుగులు వేసిఉండవచ్చు, ఒక్కొక్కసారి, చెలరేగిపోవడమే కనిపించి ఉండవచ్చు, లక్ష్యసాధన మార్గాల సమీక్షలకు వెసులుబాటు ఇవ్వకపోవచ్చు. విశాల భారతంలోని వివిధ సమాజాలతో తగిన సాహచర్యం లేకపోయి ఉండవచ్చు, మతతత్వ ప్రమాదాన్ని తేలికగా తీసుకుని ఉండవచ్చు, ఎన్నయినా తప్పులు ఎన్నవచ్చు. మేము ముందే చెప్పాము, దానిని విననందువల్ల కలిగిన ఫలితం ఇది, అన్న హేళనలకు, మీ తప్పులే మిమ్మల్ని అంతం చేస్తున్నాయన్న నిర్ధారణలకు ఇప్పుడు ఔచిత్యమూ లేదు, సందర్భమూ కాదు. వాళ్ల తప్పులో ఒప్పులో వాటి ఫలితాలను వారే ఎదుర్కొంటున్నారు, స్వీకరిస్తున్నారు. వ్యవస్థ మీద నిర్దాక్షిణ్యమైన, ప్రజల మీద ప్రేమాత్మకమైన విమర్శ పెట్టి, యథాతథాన్నిపెకలించేవారు లేకపోతున్నారు కదా అన్నదొక్కటే, ప్రేక్షక సమాజానికి ఇప్పుడు తెలిసిరావలసిన విషయం.
విడత విడతకూ ఇరవైలు ముప్పైలు చొప్పున కాల్చివేతలు జరుగుతూ, మృతుల సంఖ్య వందలలోకి పెరిగిపోతూ, మధ్యభారతంలో ఒక ఏకపక్ష యుద్ధం కనిపిస్తుండగా, ఎందుకు ఏ అలజడీ లేదు? అలికిడీ కూడా అంతంత మాత్రమే ఎందుకు? ఇవే అంకెలు వేరే సందర్భాలలో కనిపిస్తే గగ్గోలు పెట్టే, రాజకీయులందరూ ఎందుకు పెదవులు బిగపట్టుకుని కూర్చున్నారు? ఇదంతా సహజమనా? అన్యాయమో అవాంఛనీయమో అయినా అనివార్యమనా? అందరి ప్రయోజనాలూ నెరవేరుతున్నాయనా? గొంతు విప్పితే అదే గాటన కట్టేస్తారనా?
2004 లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగాయి. ఒక విడత చర్చల తరువాత ఆ ప్రక్రియ విఫలమై, తిరిగి మొదలైన ఎన్‌కౌంటర్ల పరంపర, అంతిమంగా, నల్లమల ను మావోయిస్టు పార్టీ ఖాళీచేయడానికి దారితీసింది. అప్పటి నుంచి, అక్కడక్కడా నామమాత్రపు ఉనికి తప్ప, ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు ఉద్యమక్షేత్రాలు లేకుండా పోయాయి. దశాబ్దంన్నరకు పైగా, తెలుగు ప్రాంతాలను ఆనుకుని ఉండే దండకారణ్యం, ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు మాత్రమే మావోయిస్టు ప్రభావరంగాలుగా ఉంటున్నాయి. కానీ, మావోయిస్టు పార్టీలో అత్యున్నత స్థానాల్లో, సీనియర్‌ల శ్రేణిలోనూ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల వారి పేర్లే వినిపించేవి. 80, 90 లలో ఉద్యమంలో చేరి అంచెలంచెలుగా ఎదిగినవారే కీలకస్థానాల్లో ఉండేవారు. తెలుగు ప్రాంతాల నుంచి తరువాత కాలంలో రిక్రూట్ మెంట్ బాగా తగ్గిపోయిందన్నారు.
కానీ, తాజాఎన్ కౌంటర్ మృతులలో కూడా గత దశాబ్ద కాలంలో పార్టీలోకి వెళ్లిన యువకులు ఉన్నారు. ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల మృతదేహాలు వారి స్వగ్రామాలకు రావడం, స్థానికులు, ఉద్యమాభిమానులు పెద్దసంఖ్యలో నివాళులర్పించడం ఇప్పటికీ తెలుగుప్రాంతాలలో చూడవచ్చు. తెలుగువారి సామాజిక జీవితంలో మావోయిస్టులు లేదా నక్సలైట్లు అంటే ఒక పరాయి పదం కాదు, ఎవరో తెలియని సాయుధులు కారు, వారి గ్రామీణులే, బస్తీలలోని వారే, వారి బంధువులే, వారితో మెలగినవారే. ఉద్యమం బలంగా ఉన్నప్పుడు నక్సలైట్ల వల్ల బాధితులైనవారు మినహాయించి, తక్కినవారందరికీ నక్సలైట్ల వ్యక్తిత్వం మీద అభిమానమో, తటస్థభావమో, ఏమీ లేకున్నా, ఒక పరిగణనో ఉంటుంది. ప్రభుత్వాలు, మీడియా చేసే ప్రచారాల ప్రభావం కంటె, వారి వారి స్వీయానుభవాలే తెలుగు గ్రామాల ప్రజల అంచనాలలో ప్రతిఫలిస్తాయి.
ఆంధ్ర కంటె తెలంగాణలో ఇంకా ఉద్యమప్రభావం బలంగా కనిపిస్తుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒక బలమైన భాగస్వాములుగా మావోయిస్టు అభిమానులు, ప్రజాసంఘాల సభ్యులు పనిచేశారు. వారిలో కొందరు సరిహద్దు దాటి ఉద్యమంలోకి వెళ్లారు. కానీ, ప్రత్యక్షంగా క్షేత్రంలో మావోయిస్టు ఉద్యమం లేకపోవడం వల్ల, కొత్తతరాల వారికి అది, పెద్దల జ్ఞాపకంగానే మిగిలిపోతున్నది. ఒకనాటి బలమైన ఉద్యమకేంద్రమయిన ఉత్తర తెలంగాణలో ఇప్పుడు మతవాదరాజకీయాలు బలం పుంజుకుంటున్నాయి. యువకుల ఆలోచనావిధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఆధునిక, ప్రగతిశీల, ప్రజాస్వామిక ఆలోచనలతో యువతను అనుసంధానించే శక్తులేవీ తెలంగాణలో ఇవాళ క్రియాశీలంగా లేవు, ఉన్నా, ప్రభావవంతంగా లేవు.
ఆంధ్ర కంటె తెలంగాణలో ఇంకా ఉద్యమప్రభావం బలంగా కనిపిస్తుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒక బలమైన భాగస్వాములుగా మావోయిస్టు అభిమానులు, ప్రజాసంఘాల సభ్యులు పనిచేశారు. వారిలో కొందరు సరిహద్దు దాటి ఉద్యమంలోకి వెళ్లారు. కానీ, ప్రత్యక్షంగా క్షేత్రంలో మావోయిస్టు ఉద్యమం లేకపోవడం వల్ల, కొత్తతరాల వారికి అది, పెద్దల జ్ఞాపకంగానే మిగిలిపోతున్నది. ఒకనాటి బలమైన ఉద్యమకేంద్రమయిన ఉత్తర తెలంగాణలో ఇప్పుడు మతవాదరాజకీయాలు బలం పుంజుకుంటున్నాయి. యువకుల ఆలోచనావిధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఆధునిక, ప్రగతిశీల, ప్రజాస్వామిక ఆలోచనలతో యువతను అనుసంధానించే శక్తులేవీ తెలంగాణలో ఇవాళ క్రియాశీలంగా లేవు, ఉన్నా, ప్రభావవంతంగా లేవు. కానీ, నలభై సంవత్సరాలు, ఆ పైన వయస్సున్న వారికి, ఇప్పటికీ మావోయిస్టు, నక్సలైట్ ఉద్యమకాలం ఒక మహత్తరమైన, ఉత్తేజకరమైన జ్ఞాపకంగా ఉంటున్నది. ఒకనాటి తరహాలో వారు ఉద్యమంతో కలసి నడవగలరా అన్నది మాత్రం చెప్పలేము. ఒకనాడు భూస్వామ్యవ్యతిరేకపోరాటం వల్ల సమకూర్చుకున్న సామాజిక విలువలు బలహీనపడి, తెలంగాణలో మతోన్మాదం, మాదకద్రవ్యాలు, కులహత్యలు, జూదం, రాజకీయ అవినీతి, ఆర్థికనేరాలు బాగా పెరిగిపోతున్నాయి. పట్టణాలలో అసాంఘిక, దౌర్జన్యకర ముఠాలు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నాయి. పాలక రాజకీయాలు కూడా అందుకు తగినట్టుగా రూపుదిద్దుకుంటున్నాయి. నక్సలైట్లు బలంగా ఉన్నకాలంలో సామాజిక పరిస్థితులు ఎట్లా ఉండేవో అడిగితే, సానుకూలమైన, ప్రశాంసాత్మకమైన అభిప్రాయాలు చెప్పేవారిలో ఆ నాటి పోలీసు అధికారులు కూడా ఉంటారు.
కానీ, నలభై సంవత్సరాలు, ఆ పైన వయస్సున్న వారికి, ఇప్పటికీ మావోయిస్టు, న క్సలైట్ ఉద్యమకాలం ఒక మహత్తరమైన, ఉత్తేజకరమైన జ్ఞాపకంగా ఉంటున్నది. ఒకనాటి తరహాలో వారు ఉద్యమంతో కలసి నడవగలరా అన్నది మాత్రం చెప్పలేము. ఒకనాడు భూస్వామ్యవ్యతిరేకపోరాటం వల్ల సమకూర్చుకున్న సామాజిక విలువలు బలహీనపడి, తెలంగాణలో మతోన్మాదం, మాదకద్రవ్యాలు, కులహత్యలు, జూదం, రాజకీయ అవినీతి, ఆర్థికనేరాలు బాగా పెరిగిపోతున్నాయి. పట్టణాలలో అసాంఘిక, దౌర్జన్యకర ముఠాలు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నాయి. పాలక రాజకీయాలు కూడా అందుకు తగినట్టుగా రూపుదిద్దుకుంటున్నాయి. నక్సలైట్లు బలంగా ఉన్నకాలంలో సామాజిక పరిస్థితులు ఎట్లా ఉండేవో అడిగితే, సానుకూలమైన, ప్రశాంసాత్మకమైన అభిప్రాయాలు చెప్పేవారిలో ఆ నాటి పోలీసు అధికారులు కూడా ఉంటారు.
తెలుగురాష్ట్రాల గురించి, అందులోనూ ముఖ్యంగా తెలంగాణ సమాజం గురించి పట్టింపు, ఆవేదన ఉన్నవారికి నేడు ప్రబలుతున్నక్షీణసంస్కృతితో పాటు, బస్తర్‌లో జరుగుతున్న ‘అంతిమ యుద్ధం’ అంతులేని బాధ కలిగిస్తుంది. ఎందుకంటే, దాని తల్లిపేగు తెలుగునేలలో ఉన్నది. మావోయిస్టులు ఈ దశను అధిగమించగలరన్న నమ్మకం కనిపించడం లేదు. అయినంత మాత్రాన, మానవప్రయత్నాలు ఆగిపోతాయని కాదు, మరో రూపంలో మరో పద్ధతిలో, మరింత వివేచనతో, ఈ అపసవ్య, అమానవ సమాజాన్ని సవ్యమూ, మానవీయమూ చేసే ప్రయత్నాలు మొదలవుతాయి, కొనసాగుతాయి. కానీ, దశాబ్దాల తరబడి మనుషులు తమను తాము పాత నుంచి పెకిలించుకుని, ముందుకు నడవడానికి పడ్డ తపన, చేసిన కృషి, ఆ క్రమంలో సాధించుకున్న చైతన్యం, వ్యక్తిత్వం అన్నీ ప్రమాదంలో పడడం క్షోభ కలిగిస్తుంది. ఆశ- దైర్యం కోసం సంకల్పపూర్వకంగా తెచ్చుకునే ఆలంబన. నిరాశ- బాహ్యపరిస్థితులకు కలిగే సహజాత స్పందన.




